ఈటెలా…ఈ పిల్లి మొగ్గలేలా!

`అర్థిక మంత్రిగా పనిచేసిన పరిజ్ఞానం ఇంతేనా…ఈటెలా?

`కాళేశ్వరం నీళ్లు…పుట్లకు పుట్లు వడ్లు.

`కాళేశ్వరం నీళ్లు…రైతు ఇంట సిరులు.

` రైతు మేలుకు లెక్కలా?

` వేములవాడ లో కాళేశ్వరం నీళ్లకు పూలాభిషకం చేయలేదా?

`కాళేశ్వరం నీళ్లతో పంటలు కాకుండా పరిగెలు కనిపిస్తున్నాయా? 

`రైతుకొస్తున్న ఆదాయం చూస్తున్నావా?

` అప్పు లేని రైతులు తెలంగాణ సంపదకు వారసులు కారాదా?

`సాగు విస్తీర్ణం ఎంత పెరిగిందో గణాంకాలు తెలియవా?

`భూముల ధరల పెంపు తెలంగాణ సంపదలో భాగం కాదా?

`సాగు సంపద సృష్టికి మూలం కాళేశ్వరంలో లేదా?

`తెలంగాణ పడిన గోస అప్పుడే మర్చిపోయారా?

` చుక్క నీటి కోసం విలవిల లాడిన తెలంగాణ గుర్తు లేదా?

`ఆఖరుకు క్రాప్‌ హలీడేలు ప్రకటిస్తే విలవిలాడిన తెలంగాణ గుర్తుందా?

`ఎండాకాలంలో గ్రాసం లేక, బక్కచిక్కిన పశువులు గుర్తులేదా?

` రైతు దు:ఖం తెలిసే ఇలా మాట్లాడతున్నారా?

`మీరు రైతులే కదా?

` రైతు మేలోర్వలేకపోతున్నామని చెప్పదల్చుకున్నారా?

` రాజకీయం రైతు క్షేమంగా వుండడం బిజేపికి ఇష్టం లేదా?

`కాళేశ్వరం నీళ్లు లేనిదే చెరువులు నిండుతున్నాయా?

`ఇంటింటికీ నీళ్లొస్తున్నాయా?

`పరిశ్రమలు వస్తున్నాయా? నడుస్తున్నాయా?

` ఇన్ని అవసరాలు తీర్చుతున్న నీళ్లకు కాళేశ్వరం కారణం కాదా?                                

హైదరబాద్‌,నేటిధాత్రి:       

చెప్పేవాడికి లేకపోయినా, వినేవాడికైనా విజ్ఞత వుండాలని పెద్దలు చెప్పారు. కళ్లముందు నీళ్లు కనిపిస్తున్నాయి. అవి కాళేశ్వరం నీళ్లు అని ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వం నీళ్లు కానే కాదు..ప్రకృతి సహకరించడంతోనే తెలంగాణలో నీళ్లు…పంటలు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నిజమా? ప్రభుత్వం చెప్పే మాటలు నిజమా? అన్నది ప్రజలకు తెలుసు. నిజంగానే ఇటీవల తొమ్మిది సంవత్సరాల కాలంలోనే విపరీతమైన వర్షాలు పడి, విపరీతంగా భూగర్భ జాలలు పెరిగాయా? అంతకు ముందు వర్షాలు లేవా? తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు కురవలేదా? కురిసినా రైతులు అప్పుడు వ్యవసాయం చేయకుండా భూములు వదిలేసుకున్నారా? ఊళ్లో వుండలేక తిన్నది అరక్క, అప్పులు పాలయ్యారా? అవి తీర్చేందుకు కూలీ పనులు చేసేవారా? ఊరిలో ఎకరాలకు ఎకరాలు భూములు వదిలేసుకొని, ఇతర ప్రాంతాల్లో హాయిగా బతికేందుకు వెళ్లారా? ఇల్లూ, వాకిలి వదిలి ఏ ఏడాదికో, రెండేళ్లలో ఓసారి చుట్టపు చూపుగా ఊరికొచ్చి, మళ్లీ పొట్ట చేత పట్టుకొని వెళ్లేవారా? నిజంగానే రైతులు తిన్నది అరక్క ఒక్కొక్క రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసుకునేవారా? ఒక్క బోరే ఎల్లబోస్తుంటే సాగుకు చాలదని బోర్లమీద బోర్లు వేసి, లక్షలకు లక్షలు అప్పులు చేసుకునేవారా? అయినా తెలంగాలో వున్న భూమినంతా పడావు పెట్టి, హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడ సెక్యూరిటీ గార్డులుగా, సిగరెట్‌ కంపనీలలో, ఇతర కూలీ పనులు చేసుకుంటూ బతకాలన్న సోకుండేదా? అంతగా భూగర్భ జలాలు, కరంటు విస్తారంగా వున్న తెలంగాణ ప్రజలు పొద్దు పోక తెలంగాణ ఉద్యమం చేశారా? నీటి విషయంలో, కొలువుల విషయంలో, నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా, 60 ఏళ్లపాటు నిరంతంగా కొట్లాడారా? ఆఖరుకు పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సుధీర్ఘమైన తెలంగాణ పోరాటం జరిగిందా? వర్షాలే, వర్షాలు, భూగర్భ జలాలు, చెరువుల నిండా నీళ్లు, బోర్ల ఎల్లవోసుడు, వాగులు దుంకుడు, చెరువుల మత్తళ్లు, బావులో చేదుకునేంత పైకి నీళ్లు వున్నా, తెలంగాణ ప్రజలు సాగు చేసుకోక తెలంగాణ కోసం కొట్లాడారా? ప్రతిపక్షాలు చెప్పే అర్ధం లేని మాటలు వింటే నేటి తరం నిజమని నమ్మే ప్రమాదం వుంది. తెలంగాణ కోసం నేనూ కొట్లాడిన అని పదేపదే చెప్పే ఈటెల రాజేందర్‌కు తెలంగాణ పరిస్ధితులు తెలియవా? నాడు భూగర్భజలాలు ఎందుకు అడుగంటి పోయేవో ఈటెలకు తెలియదా? అసలు భూగర్భ జాలాలు ఎంత లోతులో వుండేవో? బావులు, బోర్లు ఎందుకు ఎండిపోయేవో రాజేందర్‌కు తెలియదా? తెలిసి, తెలిసి అబద్దాలు చెప్పడం రాజకీయ అవకాశ వాదానికి నిదర్శనం కాదా? రాజకీయ పబ్బం కోసం పనికి మాలిన మాటలు చెప్పడం కాదా? ఆ గోసలు చూసింది కాదా? అనుభవించింది లేదా? ఉమ్మడి రాష్ట్రంలో అసలే ఆరు తడి పంటలకు కూడా దిక్కులేకుండా పోయి, రైతుల అల్లాడిపోలేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్రాప్‌ హలిడే ప్రకటించిన నాడు తెలంగాణ ఎంత కటిక దరిద్రం అనుభవించిందో తెలియందా? ఈటెల రాజేందర్‌ లాంటి వారు కూడా నోరు తెరిస్తే అబద్దాలు ప్రచారం చేయడాన్ని ప్రజలు స్వాగతించరు. నిజాలు చెప్పడం చేతకన్నాప్పుడు, మౌనంగా వుండడం మంచిది. అంతే కాని ప్రభుత్వంలో కూడా పాలు పంచుకొని, ఆరున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేసి, తెలంగాణలో నీళ్లు అబద్దం అంటే ప్రజలు చీ కొడతారు? తెలంగాణ రాక ముందు పరిస్ధితి ఏమిటి? ఇప్పుడు పరిసి ్ధతి ఏమిటి? తెలంగాణలో ఎప్పుడో గత తప్పిపోయిన వాగులు, వంకల్లో కూడా ఇప్పుడు ఎండా కాలంలో కూడా నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయంటే కారణం కాళేశ్వరం నీళ్లుకాదా? ఎప్పుడో విపరీతమైన వర్షాలు కురిస్తే తప్ప, వేములవాడలో కనిపించే వాగులో నీరు చూసిన సందర్భాలుంటాయా? మరి అలాంటి వాగులో పారుతున్న నీళ్లకు పుష్పాభిషేకం చేసి, గంగమ్మకు దండం పెట్టింది ఈటెల రాజేందర్‌ కాదా? ఆనాడు కాళేశ్వరం నీళ్లని కళ్లకు అద్దుకున్నది ఈటెల రాజేందర్‌కుగుర్తు లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాలు పంచుకున్న ఈటెల రాజేందర్‌ అబద్దాలు ప్రచారం చేయొచ్చా? అసలు ఆర్ధిక శాఖ మంత్రిగా ఏటా కాళేశ్వరానికి నిధుల కేటాయింపులు చేసిందే ఈటెల రాజేందర్‌. ఆర్ధిక శాఖను నిర్వహిస్తూ, కాళేశ్వరానికి నిధుల మంజూరు కలలో చేశావా? అన్న ప్రశ్న ప్రజలు అడుగుతారు? సమాధానం ఈటెల రాజేందరే చెప్పాల్సివుంటుంది. 

కాళేశ్వరానికి పెట్టిన ఖర్చు ఎప్పుడో తీరిపోయింది! 

అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన సందర్భాన్ని కూడా అర్ధం చేసుకునే పరిజ్ఞానం లేకపోతే ఈటెల రాజేందర్‌ లాంటి వారికి రాజకీయాలెందుకు? ప్రభుత్వాలు పెట్టే ఖర్చులలో అన్నింటినీ తిరిగి అక్కడే రాబట్టుకోవాలని చూసుకోదు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినంంత వరకు చాలా వరకు ప్రభుత్వాలు రిటన్‌ ఆలోచించవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు ఇవ్వలేక ఇవ్వలేకపోయారు. తెలంగాణ మొత్తానికి సాగు నీళ్లు ఇవ్వాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యమని వదిలేశాయి. తెలంగాణ ప్రజల ఖర్మ అని పట్టించుకోలేదు. నిజానికి ఏ ప్రభుత్వం అలా చేయొద్దు. కాని ఉమ్మడి పాలకులు అంత దుర్మార్గంగా వ్యవహరించారు. అందుకే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ మొత్తానికి ఎలా న్యాయం జరగాలి. కరువు పరిస్ధితులు ఏర్పడినా తెలంగాణ ఎండిపోకుండా వుండాలి? ఎక్కడెక్కడ నీటి నిల్వలు చేసుకోవాలి. భవిష్యత్తులో ఏళ్ల తరబడి కరువు వచ్చినా కనీసం మంచినీటి కటకట కూడా రాకుండా వుండేందుకు ఏం చేయాలి? అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి చేసిందే కాళేశ్వరం.

తెలంగాణ రాక ముందు సాగైన విస్తీర్ణం 45లక్షల ఎకరాలు.

 పదిహేడు వేల పంపుసెట్లు. మరి ఇప్పుడు కోటిన్నర ఎకరాల సాగు జరుగుతోంది. నాడు ఒక్క బోరు వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి కావాలి. అందుకు కరంటు సౌకర్యానికి కూడా ఖర్చు చేయాల్సివచ్చేది. కాకతీయ లాంటి కాలువపై ఎవరైనా మోటర్‌ పెట్టుకుంటే వారికి విద్యుత్‌ చట్టాలు అమలు చేసేవారు. ఇక రైతులు బిల్లులు చెల్లించకపోతే కూడా అదే పరిస్ధితి వుండేది. కాని నేడు కాకతీయ కాలువ పొడువునా రైతులు ఇష్టమొచ్చిన రీతిలో మోటార్లు నడిపిస్తున్నారు. రైతులు తమ సాగుకు అవసరమైనన్ని భోర్లు వేసుకున్నారు. కరంటు సౌకర్యం ఉచితంగా అందుకుంటున్నారు. ఏడాది పొడవునా చెరువుల్లో నీళ్లు చూస్తున్నారు. ఆ ఊటలతో పెరిగిన భూగర్భజలాలు బోర్లును సజీవం చేస్తున్నాయి. కాళేశ్వరం నిర్మాణమే ఒక అధ్భుతం. అందుకైన ఖర్చుకన్నా, ఎక్కువగా రైతులు పండిరచిన పంటలు వచ్చాయి. అంటే అది ప్రభుత్వ విజయం కాదా? ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతు కోసం చేసిన దానికి ఫలితం కాదా? రైతులకు నీళ్లిస్తే ఎంత ఖర్చువుతుంది? అది ఎలా రాబట్టాలి? అని ఆలోచించేదుకు తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో లేదు. తెలంగాణ భవిష్యత్తు మీద అవగాహన లేని పాలకుడు కేసిఆర్‌ కాదు. తెలంగాణ ఆకాంక్ష తోనే తెలంగాణ అభివృ ద్ధి ఎలా అన్నది నిర్ణయించుకున్న ఉద్యమ కారుడు. ఆయన గురించి మాట్లాడాల్సివస్తే, తెలంగాణలోనే కాదు, దేశంలో ఎవరికీ శక్తి చాలదు. ఆయన ముందు ఏ నాయకుడు నిలబడలేదు. ఆర్ధిక వేత్తలుగా అంకెల లెక్కలేసి, అక్కరకు రాని లెక్కలు చెబుతూ పొద్దు పుచ్చుకునేవారికి రైతు విలవ తెలియదు. కేవలం రూపాయి రాకడ, పోకడ గురించి మాట్లాడేవారికి రైతు కష్టం అంతకన్నా తెలియదు. వారి దారిలోనే నడుస్తానంటున్న ఈటెల లాంటి వారి మాటలు ప్రజలు అసలే పట్టించుకోరు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ లో వారంలో రెండు రోజులు మాత్రమే మంచినీళ్లు వచ్చేవి. హైదరాబాద్‌కు మంచినీళ్లు తరలించడం కూడా పెను భారమని, ప్రజలు ఎవరి బాధలు వారు పడతారని వదిలేశారు. అంతే కాదు ఎవరి ఇంటి ముందు వాళ్లు వాడే నీటిని వృథా కాకుండా భూగర్భ జల మట్టాలు పడిపోకుండా వుండాలంటే, నీటి గుంతలు తీసుకుంటే తప్ప మంచినీళ్లు ఇవ్వలేదు. ఇదీ ఆనాటి పరిస్ధితి మరి నేడు..మిషన్‌ భగీరధ ద్వారా నిత్యం స్వచ్ఛమైన శుభ్రమైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన మంచినీరు ప్రజలకు అందుతోంది. పదేళ్ళ క్రితం హైదరాబాద్‌కు, పదేళ్లలో పెరిగిన హైదరాబాద్‌కు ఎంతో తేడా వుంది. ఈ పదేళ్లలో సగానికిపైగా హైదారాబాద్‌ విస్తరించింది. అయినా నీటి కటకట లేకుండాపోయింది. నీరు రావడం లేదన్న పిర్యాధు లేదు. పైగా ఆ నీటికి చార్జీలు లేవు. ఒకనాడు హైదరాబాద్‌ నీటి మీటర్లు పెట్టి మరీ బిల్లులు వసూలు చేశారు. అన్నీ తెలిసినా ప్రతిపక్షాలకు చెప్పుకునేందుకు ఏ ఒక్క అంశం లేదు. అందుకే వితండవాదం చేస్తే చాలనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *