ఇవేం దిక్కుమాలిన కమిటీలు?

`ఎన్ని కమిటీలు వేసి తయారు చేస్తారు నివేదికలు?

`కావాలనే కాలయాపనలు?

`భ్రూణ హత్య కేసులో అధికారుల చిత్రవిచిత్రాలు!

`కాలయాపన తప్ప, కనువిప్పు లేదు…కదిలింది లేదు?

` జిల్లా యంత్రాంగం ఇచ్చిన కమిటీ కలెక్టర్‌ త్రోసిపుచ్చారు?

`తిరిగి ఫైలు పంపించారు?

`మళ్ళీ నివేదిక తయారు చేశారా? కలెక్టర్‌ కు అందజేశారా తెలియదు?

`డిఎంఅండ్‌ హెచ్‌ఓ ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందించరు…సమాధానం చెప్పరు?

`తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ వేసిన కమిటీ ఏం చేసిందో వివరాలు లేవు?

`నివేదిక తయారైనట్లు, మరో కమిటీ నియమిస్తున్నట్లు తెలుస్తోంది?

`ఎన్ని కమిటీలు వేస్తారు?

`ఎంత కాలం సాగదీస్తారు?

`రజిత చనిపోయి వందరోజులౌతోంది!

`వైద్యురాలు సబితను అందరూ కలిసి వెనకేసుకొస్తున్నారా?

`కాపాడుతున్నారా? 

`ఏం జరుగుతోంది? రజితకు న్యాయం జరిగేదుందా?

`అటకెక్కిన ఫైలు దుమ్ము పేరుకుపోవాల్సిందేనా?

నిండు గర్భిణీ రిజత ప్రాణం పోయేందుకు కారణమై, పిల్లలను అనాధలను చేసి, భ్రూణ హత్యలే వ్యాపకంగా, వ్యాపారంగా మార్చుకొని వైద్య వృత్తి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని దోషులుగా తేల్చేందుకు ఇంత కాలమా…ఇంత కాలయాపనా? వైద్యురాలిగా ప్రచారం చేసుకుంటూ సబిత అనే ఓ మహిళ సాగిస్తున్న అరాచకానికి, ప్రజల ప్రాణాలు తోడేస్తున్న తోడేలు లాంటి వ్యక్తులను అధికారులే వెనకేసుకొస్తున్నారా? కాపాడుతున్నారా? అన్న అనుమానం రాకుండా వుంటుందా? ఎంత కాలం కాపాడుతారు? ఇంకా ఎంత మంది ప్రాణాలు పోయేందుకు కారణమౌతారు? అభం శుభం తెలియని ఓ అమాయకురాలైన రజితను నమ్మించి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా గర్భం తొలగిస్తామని చెప్పి, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వుండదని చెప్పి, కళ్లు తెరవని పసిగుడ్డుతోపాటు, ఇద్దరు పసి బిడ్డలున్న తల్లి రజితను కూడా పొట్టనబెట్టుకున్నారు. అబార్షన్‌ పేరుతో రజిత ప్రాణాల మీదకు తెచ్చి సబిత వదిలేసింది. హన్మకొండలోని రుయా ఆసుపత్రికి పంపి చేతులు దులుపుకున్నది. రజిత కు వైద్యం చేస్తామని ఆసుపత్రిలో చేర్చుకొని రుయా ఆసుపత్రి చేతులేత్తేసింది. తమ వల్ల కాదని శ్రీ చక్ర ఆసుపత్రికి ప్రాణాలతో పోరాటం చేస్తున్న రజితను పంపింది. వైద్యం పేరుతో ప్రయోగం చేసి, రజిత ప్రాణాలు పోతుంటే శ్రీ చక్ర వైద్యులు చోద్యం చూశారు…తమకు చేతగాని వైద్యం చేస్తామని చెప్పి ప్రాణాలు రజిత ప్రాణాలు గాలిలో కలిపేశారు. ఓ కుటుంబాన్ని ఆగం చేశారు. పిల్లలను అనాధలను చేశారు. ఆ కుటుంబాన్ని మభ్య పెట్టి మాయ చేశారు. అమాయకుల జీవితాలను వీధినపడేశారు. ఓ అమాయకురాలి ప్రాణం తీశారు. మరి అలాంటి వారిపై చర్యలుండవా? వెలుగులోకి వచ్చిన ఈ ఒక్క సంఘటనే కాదు, అనేకం జరుగుతున్నాయి. ఇదే సబిత అనే వైద్యురాలు గతంలో మూడు సార్లు పట్టుబడిరదన్న సంగతి నేటిధాత్రి చెబుతూనే వుంది. సబిత చేస్తున్న చట్టవ్యతిరేకమైన అబార్షన్లను ఎప్పటినుంచో చేస్తున్న సంగతి కూడా వెలుగులోకి తెచ్చింది. ఆమె చేసే అక్రమ అబార్షన్లను అడ్డుకొని, ఆమెను పోలీసులకు పట్టించిన ప్రభుత్వ వైద్యుడు వెల్లడిరచిన విషయాన్ని కూడా నేటిధాత్రి ప్రచురించింది. ప్రస్తుతం తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన బోర్డులో ఆ వైద్యుడు సభ్యుడుగా వున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే రజిత కుటుంబ సభ్యుల చేత డిఎంఅండ్‌హెచ్‌వో వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆ నివేధికను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్‌ ఆ నివేదికలో లోపాలున్నాయన్నారు. ఫైలు తిరిగి వెనక్కి పంపారు. మళ్లీ ఎంక్వైరీ చేశారా తెలియదు. కలెక్టర్‌కు మళ్లీ నివేధిక ఇచ్చారా? అన్నదాని గురించి సమాచారం లేదు. బాధితురాలికి నాయ్యం జరగింది లేదు. ఆ కుటుంబానికి మేలు జరిగింది లేదు. 

కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. డిఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో నివేధిక కలెక్టర్‌కు చేరింది. తిరిగి ఆ ఫైలు డిఎంఅండ్‌హెచ్‌వో కు తిరిగి పంపబడిరది. అయినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. నేటిధాత్రిలో వస్తున్న వస్తున్న వరుస కథనాలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించి, వివరాలు సేకరించాలని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రేత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అది ముక్కుతూ, మూల్గుతూ, ఇప్పుడు, అప్పుడూ అంటూ ఇంత కాలం ఆగి, ఆగి ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేధికలో ఏం చెప్పిందనేది ఓ బ్రహ్మపదార్ధమే…అయినా చర్యలకు ఉపక్రమించారా అంటే అదీ లేదు. మళ్లీ ఈ నివేదికపై ఓ కమిటీ ఏర్పాటుతో మరింత కాల యాపనకు మరో అస్త్రం అధికారులు సంధించారు. సబితను కాపాడే ప్రయత్నంలో వున్నారు. ఇదేనా ప్రభుత్వాధికారులు నిర్వహించాల్సిన పాత్ర….కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోవడానికి ఇదేమైనా రాజకీయ పరమైన అంశమా? ఓ తల్లి నిండు ప్రాణం. వైద్యం పేరుతో ఓ మహిళ ప్రాణాలు తీసిన విషయం. అయినా దానిపై పెద్దగా స్పందన లేదు. స్పందించేవారు లేరు. కదిలేవారు లేరు. కాలయాపనకు మాత్రం అందరూ కలిసే ఫైలును అడకెక్కించించి, దుమ్ము పట్టిస్తున్నారు. దాన్ని అందరూ మర్చిపోయేలా చేస్తున్నారు. అసలు ఆ ఘోరాన్ని కేసుదాకా కూడా వెళ్లకుండా చేస్తున్నారు. నిందుతురాలుగా మారాల్సిన వైద్యురాలు మళ్లీ తన పని తాను చేసుకుంటూ, అదే పైత్యంలో వున్నారు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా డిఎంఅండ్‌హెచ్‌వో స్పందించరు. కనీసం కాల్‌ లిఫ్ట్‌ చేయరు. విషయం వెల్లడిరచరు. అంటే అదేమైనా తమ స్వంత వ్యవహారమనుకుంటున్నారా? మీడియాకు కూడా స్పందించకపోతే, ఇక ఆ అధికారి ప్రజలకు అందుబాటులోకి వస్తారా? వారిచ్చే పిర్యాధులు స్వీకరిస్తారా? బాధితులకు న్యాయం చేస్తారా? ఓ వైపు ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు బోగోతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వాటిమీద స్పందించాల్సిన అవసరం సాంబశివరావుకు వుంది. కాని ఆయన ఎవరికీ వివరాలు వెల్లడిరచరు. అడిగేందుకు కూడా అవకాశం ఇవ్వరు. జవాబు దారి తనం ఎప్పుడో వదిలేశారు. మరి ఇలాంటి వారి వల్లనే వ్యవస్ధలో ఇన్ని రకాల లోపాలు పొడసూపుతున్నాయన్న అపవాదులు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయినా ఆయనెందుకు స్పందించడం లేదో అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైద్యశాఖ పర్యవేక్షించాలి. 

ఇంత పెద్ద సంఘటన జరిగి వంద రోజులౌతోంది. చనిపోయిన రజిత ఏడాది కాలం పూర్తయినా నివేదికలు తయారైయ్యేలా లేవు. వెలుగులోకి వచ్చేలా లేవు. సబిత మీద చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదు. మూడు రోజులు జైలు…నాలుగో రోజు బెయిలు…అంతకన్నా నాకేం జరుగుతుందన్నంత ధీమాతో, అహాంకారంతో సబిత మాట్లాడుతోందని చెప్పినా అధికారుల కదలకపోవడం విడ్డూరం. పైగా ఈ ఘటన వల్ల నష్టపోయిన రజిత కుటుంబానికి న్యాయం జరగాలని, సబిత లాంటి వారికి శిక్షపడాలని ఇంత కాలంగా అక్షర పోరాటం చేస్తున్న నేటిధాత్రి మీద కూడా ఇష్టాను రీతిన మాట్లాడుతూ, తమను ఎవరూ ఏం చేయలేరంటున్నారని కూడా సమాచారం. మరి జరిగిన విషయాల మీద నేటిధాత్రి వరస కథనాలు ప్రచురించింది. అంతే కాకుండా ఆయా ఆసుపత్రుల వైద్యులు చెప్పిన వివరాలు కూడా ప్రచురించడం జరిగింది. అవే వివరాలు ప్రభుత్వ కమిటీలకు కూడా వెల్లడిరచే వుంటారు. కాని ఆ మాటలు అధికారులు, కమిటీలు ఏమైనా తారు మారు చేశాయా? ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అన్నది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కమిటీ సభ్యులపై వుంది. అదే ప్రభుత్వ వైద్యులు ఏ పొరపాటు చేసినా వెంటనే చర్యలుంటాయి. కాని అదే ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వైద్యులను ఎందుకు వెనకేసుకొస్తున్నారన్నదానిపై స్పష్టత రావాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలకు ఎందుకు జాప్యం చేస్తున్నాన్నదానిని ఎవరు పట్టించుకోవాలి. రజితకు జరిగిన అన్యాయం విషయంలో మాత్రం నేటిధాత్రి తన పోరాటం ఆపదు…అక్షర యజ్ఞం ఆగదు…నిండు గర్భిణి ప్రాణాలు పోవడానికి కారణమైన వారికి శిక్ష పడేదాకా నేటిధాత్రి కథనాలు ఆగవు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!