ఇంతా అభివృద్ధి ఇంకెక్కడైన జరిగిందా

ఎనమిదేళ్లలో ఇంత ప్రగతి ఎక్కడా జరగలేదు.

`ఇంకా పసికూనే అయినా, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం.

`తెలంగాణ కల నెరవేర్చిన నాయకుడు కేసిఆర్‌ అంకితభావానికి నిలువెత్తు సాక్ష్యం.

`కొత్త రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి పనులు ఊహించడమే గగనం.

`తెలంగాణలో పూర్తి చేసుకున్నం.

`దశాబ్దాల పాటు సాగే ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడం ఒక రికార్డు.

`అసలు ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమని ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు.

`కాళేశ్వరం నిర్మాణం తెలంగాణకే మణిహారం.

`మల్లన్న సాగర్‌ మరో చరిత్రకు శ్రీకారం.

`వచ్చే తరతరాలకు తరగని నీటి సంపదలకు నిదర్శనం.

`యాదాద్రి నిర్మాణం… ఈ తరానికే మణిమకుటం.

`వరంగల్‌ టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఓ అద్భుతం.

`వస్త్ర పరిశ్రమలో నూతన శకం.

`వరంగల్‌ లో వెయ్యి పడకల ఆసుపత్రి తెలంగాణ ఆరోగ్య సౌధం.

`పరిపాలనలో కొత్త సెక్రెటరియేట్‌ నవతరం నిర్మాణం.

`దేశానికే తెలంగాణ మోడల్‌ గా కీర్తి కిరీటం.

`అభివృద్ధి అంటే ఇది కదా!

` ప్రగతి నివేదనం ఇంతకన్నా వుంటుందా?

`ఉమ్మడి రాష్ట్రంలో వుంటే చెరువుల పునరుద్ధరణ జరిగేదా?

`పరాయి పాలనలో మగ్గితే ఈ కరంటు వెలుగులు వచ్చేవా?

`తెలంగాణ రాకుంటే తెలంగాణ అన్న పూర్ణగా మారేదా?

`కళ్లుండి చూడలేని కబోదులకు ఇవి సమాధానం కాదా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రగతి దారి పాలకుల సంకల్పం నుంచి ఉద్భవిస్తుంది. ప్రజల ఆకాంక్షలు ప్రతిరూపమైన నిలుస్తుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధ్భుతాలు ఆవిష్కరిస్తున్నది. కలల ప్రపంచం కళ్ల ముందు కదలాడుతున్నది. ఎనమిదేళ్ల క్రితం తెలంగాణ…ఇప్పటి తెలంగాణను ఒక్కసారి గుర్తు చేసుకుంటేనే చాలు ఎంతో తేడా? నాడు నీళ్లు లేవు. నిధులు లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలులేవు. కనీసం రిజర్వాయర్లకు కూడా దిక్కులేదు. చెరువుల పూడిక తీసింది లేదు. రోడ్లు లేవు. పంటలు లేవు. సరిగ్గా తిండి లేదు. ఉపాధి లేదు. కూలీ పని దొరకలేదు. ఊళ్లలో కరువు పనలు తప్ప బతుకు లేదు. బీడు వారిన పొలాలు. వదిలేయబడి పడావు బడ్డ భూములు. వానాకాలంలో వేసిన పంట కూడా చేతికొచ్చేనో…ఎండిపోయేనో..తాలు మిగిలేనో కూడా తెలియని రోజులు. ఎండాకాలం వడగండ్లు, ఎల్ల కాలం కడగండ్లు ఇది ఎనమిదేళ్ల కిందటి తెలంగాణ. కాని ఇప్పుడు ఎక్కడా చూసిన పచ్చదనం…పైర్లు…కూరగాయల మడులు, పండ్ల తోటలు. ఊరంతా పచ్చదనమే..రైతు కళ్ల నిండా సంతోషమే..ఒకప్పుడు సాగుకు కూడా కరంటు బిల్లు నుంచి నేడు ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్‌ తెలంగాణ రైతుకు అందుతోంది. పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందుతోంది. పాడిపంటలో సాగు వర్ధిల్లుతోంది. బంగారు పంటలతో తెలంగాణ అన్నపూర్ణగా కీర్తించబడుతోంది. ఇదీ తెలంగాణ విజయం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్ప బలం. విద్య వైద్య రంగాల్లో పురోగమిస్తోంది. పారిశ్రామిక రంగంలో పరుగులుపెడుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. ఇదంతా ఐదారేళ్లలోనే సాధ్యమైంది. మిగిలినదంతా పూర్తి దశకు చేరుకున్నది. జై తెలంగాణ అన్న నినాదం నేడు అభివృద్ధిలో కనిపిస్తున్నది. ఉద్యమ నాయకుడే పాలకుడు కావడం వల్లనే ఈ అభివృద్ధి సాధ్యపడిరది. 

పట్టుమని పదేళ్లు కూడా కాకుండానే తెలంగాణలో ప్రగతి దేశానికి మోడలైంది. అసలు తెలంగాణ కోసం ప్రజలు అరవైఏళ్లపాటు కొట్లాడిన పోరాటానికి ఫలితం దక్కింది. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిత్తశుద్ది మూలంగానే సాధ్యపడిరది. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ప్రతిపాదనలకు కూడా దిక్కులేని పరిస్ధితులు. తెలంగాణలో ప్రాజెక్టులు అన్నపదం కూడా వినపడలేదు. ఆ ఊసు లేదు. ఆ ఊహ కూడ లేదు. కాని ఇప్పుడు నిజాలు..జల జల పారుతున్న నీళ్లు…ఓ వైపు కాళేశ్వరం…మరో వైపు మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, నల్లగొండలో ఉదయ సముద్రం…ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రిజర్వాయర్లు…పొలాలలో పలుగు రాళ్లు తప్ప, పంటలెప్పుడు పండాలే అని బాధపడిన పాలమూరు జిల్లాలో బంగారు సిరులు పండుతున్నాయి. ఎండిన బీడ్లన్నీ పంటలతో కళకళలాడుతున్నాయి. కరువు జిల్లాలో కరువు తరిమేయబడిరది. రైతు కష్టం తీరింది. వలస బాధ తప్పింది. ఊరిలోనే ఉపాధి కుదిరింది. పచ్చని పల్లెల్లో బతుకు భరోసా పెరిగింది. ఇదీ తెలంగాణ. ప్రజలు ఆవిష్కరించుకున్న తెలంగాణ. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదన్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలలంగాణలో కాళేశ్వరం నిర్మాణం చేసి చూపించారు. అదే సమయంలో మొదలైన ఆంధ్రప్రదేశ్‌ పోలవరం అక్కడే ఆగింది. తెలంగాణ కాళేశ్వరం నీళ్లు పొలాల్లో పారుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఒక ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిన చరిత్ర లేదు. కాని మన కాళేశ్వరం ఒక యజ్ఞంలా సాగింది. మూడేళ్లలో పూర్తయింది. అది కేసిఆర్‌ అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.తెలంగాణలో ఆలయాలను ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. 

కాని తెలంగాణ రాగానే యాదాద్రి పునర్‌నిర్మాణం చేపట్టారు. ఈ రోజుల్లో ఆలయ నిర్మాణం అన్నది ఊహకు అందనిది. అందులోనూ పూర్తి స్ధాయి రాతి కట్టడంతో పూర్వ కాలంలో నిర్మించిన ఆలయాలకు తీసిపోని విధంగా అధ్భుతమైన కోవెల నిర్మాణం అన్నది ఒక సవాలు. అసలు ఈ రోజుల్లో అలా ఆలయ నిర్మాణం సాధ్యమా? అన్న ప్రశ్నలు అనేక ఉత్పన్నమయ్యాయి. యాదాద్రి పనులు మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతిపక్షాలు అనేకం మాట్లాడాయి. ఇప్పుడు అదే నాయకులు వెళ్లి యాదాద్రి దర్శనానికి క్యూలు కడుతున్నారు. లక్ష్మినర్సింహా స్వామి ఆశీస్సులందుకుంటున్నారు. పూర్వం కొన్ని దశాబ్ధాల పాటు ఆలయాల నిర్మాణం జరిగేది. ఐదేళ్లలో అధ్భుతమైన కృష్ణ శిలతో కూడిన యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. తెలంగాణ తిరుపతిగా విలసిల్లుతోంది.ఒకనాడు తెలంగాణలో విద్యావసతులు అంతంత మాత్రమే… అందులోనూ యూనివర్సిటీల ఏర్పాటు అన్నది గగనమైన రోజులు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారే గాని,తెలంగాణలో కొత్తగా ఒక్క యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు కూడా వచ్చేశాయి. వాటికి తోడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవతో ఫారెస్టు యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇదిలా వుంటే తెలంగాణలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్టేట్‌ హర్టీకల్చర్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటైంది. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా అనేక గురుకులాల ఏర్పాటు జరిగింది. మైనార్టీ గురుకులాలు కూడ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాకుండా వుంటే ఈ వ్యవస్ధ నేడు కనిపించేది కాదు. ఊహించేందుకు కూడా వీలు కలిగేది కాదు. 

ఇక నిర్మాణ దశల్లో వున్న కొన్ని నిర్మాణాల గురించి చెప్పుకోవాల్సి వస్తే వరంగల్‌లో ఒకప్పుడు అంజంజాహీ మిల్స్‌ ఫేమస్‌.కాని దాన్ని ఉమ్మడి పాలకులు మూసేశారు. వస్త్రరంగాన్ని కుదేలు చేశారు. వస్త్ర ఉత్పత్తి ఆపేశారు. వరంగల్‌ ప్రజలకు ఉపాది దూరం చేశారు. ఇంత కాలానికి మళ్లీ అదే వరంగల్‌లో టెక్స్‌టైల్‌ ఫార్కు ఏర్పాటు చేస్తున్నారు. అది పూర్తయితే ఉమ్మడి వరంగల్‌జిల్లాల వాసులే కాదు, పొరుగున కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల ప్రజలకు కూడా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించనుంది. ఒకప్పుడు అంజంజాహీ మిల్లు మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగించేవి. ఆది మూత పడడంతో ఎంతో మంది నేత పనివారు ఉపాధి కోల్పోయారు. పైగా వ్యాపారులు కూడా తమ వ్యాపారాలను కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ వరంగల్‌ వస్త్ర వ్యాపారానికి మళ్లీ కేఆప్‌ అడ్రస్‌ కానున్నది.హైదరాబాద్‌ చుట్టూ ఏకకాలంలో నాలుగు మల్టీ సూపర్‌ స్పెషాటిటీ ఆసుత్రుల నిర్మాణం.వరంగల్‌లోనూ ముపైమూడు అంతస్థులలో రెండువేల పడకలతో కూడిన ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరగుతోంది. ఇది పూర్తయితే ఇక ఉత్తర తెలంగాణకే కాదు, పొరుగున వున్న చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర ప్రజలకు కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా అన్ని వసతులతో కూడిన వైద్యాన్ని అందించేందుకు కొత్తగా తెలంగాణ మొత్తం మీద పదివేల పడకల ఏర్పాటుతో ఆసుపత్రుల నిర్మాణం జరగనుంది. నిమ్స్‌లో మరో వెయ్యి పడకలు అందుబాటులోకి తేనున్నారు. గాంధీ ఆసుపత్రిలోనూ మరిన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశారు. నూతన సెక్రెటెరియేట్‌ నిర్మాణం.ఇటు హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహం, ఇటు వైపు అమరవీరులు సృతి చిహ్నం. మధ్యలో కొత్తగా సచివాలయనిర్మాణం. తెలంగాణ అంటే ఇదీ అని ప్రపంచానికి చాటేందుకు చకచకా సిద్ధమౌతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎనమిదేళ్ల కాలంలో సాగిన ప్రగతి ఒక అధ్భుతం. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన నిర్విరామ కృషికి నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!