ఇంతకీ..గుడి నిర్మించేనా!?

తాంబూలాల్చి తన్నుకునేలా చేస్తుందెవరు..?

` ఆ గుట్టు కినకట్టు ఎందుకు?
` గుట్టకొనడమే శాపం! గుడి కూల్చివేయడం మహా పాపం!!


` గుడిపై గుసగుసలు..శషబిశలెందుకు?
` వ్యాపారంలో దాపరికం ఏందుకు..?
` నమ్మకం లేని వ్యాపారాన్ని ప్రజలు నమ్ముతారని గ్యారెంటీ ఏది..?
` గుంటూరు స్వామి అలియాస్‌ శివ స్వామి ఎవరు?
` విశ్వధర్మ పరిరక్షణ వేధిక ఇప్పుడే ఎందుకు తెరమీదకొచ్చింది?
` గుడి మీద పెత్తనానికి శివస్వామి వేస్తున్న ఎత్తుగడలేంటి?
` అసలి శ్రీధర్‌ రెడ్డి, దేవేంద్‌రెడ్డిలెవరు?
` సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలకేమౌతారు?
` గూడుపుఠాని అంతా ఎందుకు?
` కోట్లకు కోట్లు పంచినట్లు ప్రకటనలెందుకు?

హైదరాబాద్‌ , నేటిధాత్రి :
ఇంతకీ.. ఒకే ఒక్క మాట… జూబ్లీహిల్స్‌లో కూల్చిన అభయాంజనే స్వామి గుడి నిర్మిస్తారా? లేదా? ఈ ముక్క చెప్పడానికి ఇన్ని విన్యాసాలెందుకు? ఇంత తెరచాటు నాటకాలెందుకు? ఇంత దోబూచులాటలెందుకు? రోజుకొకరు తెరమీదకు వచ్చుడెందుకు? మధ్యలో స్వాములను ఉసిగొల్పుడెందుకు? గుడిలో పూజారి వుంటే చాలు…ఈ స్వాములంతా ఎవరు? ఎందుకు? వచ్చే స్వాములు గుడి కోసమా? వారి పబ్బం కోసమా? ఇంతకీ గుంటూరు స్వామి అలియాస్‌ శివ స్వామి ఎవరు? ఎందుకొచ్చాడు? ఎవరు తెచ్చారు? ఈవిషయంలో ఎలా తలదూర్చాడు? ఎవరు ఆయనకు పెత్తనమిచ్చారు? మధ్య వర్తిత్వం ఎవరు చేయమన్నారు? ఎవరికీ కనిపించని బిల్డర్లు శివస్వామిని ఎందుకు ముందు పెట్టారు? అది వాళ్లకు వాళ్లుగా తీసుకున్న నిర్ణయమా? లేకు శివస్వామి కుతంత్రమా? బిల్లర్లతో శివస్వామి ఏంచెప్పాడు? వారిని ఏం చెప్పి నమ్మించాడు? అసలు 4 ఎకరాల 18 గుంటల గుడి భూమి, 2వేల గజాలకు తెచ్చిందెవరు? తర్వాత 750 గజాలు అంటూ ప్రచారం చేసింది ఎవరు? ఇప్పుడు కేవలం 266 గజాలదాకా తెచ్చిందెవరు? మితగా భూమిని ఏం చేయడానికి శివస్వామి మధ్యలో దూరాడు? హటాత్తుగా విశ్వధర్మ పరిరక్షణ వేధిక ఎక్కడినుంచి వచ్చింది? ఇక్కడే పదేపదే ప్రస్తావన ఎందుకు జరగుతోంది? గుడి స్ధలంలో ఆయన నిర్ణయం ఏమిటి? గుడిపై పెత్తనం కోసమా? గుడిని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసమా? అసలు ఓ స్వామితో గుడి బ్లూప్రింట్‌ వ్యవహారమేమిటి? అగ్రిమెంట్లు ఏమిటి? ఆయన వచ్చి ఉద్యమకారుల మీద ఆరోపణలు చేయడమేమిటి? ఆ అధికారం ఎవరిచ్చారు? జనం ముందు ఒక మాట, బిల్డర్లతో ఒక మాట స్వామి చెబుతున్నదెందుకు? ఇలాంటి స్వామిని విశ్వహిందూ పరిషత్‌ ఎలా నమ్మింది? అంత పెద్ద హిందూ ధార్మిక సంస్ధకే మచ్చ తెచ్చే పని ఎవరి ప్రోద్భలంతో చేశారు? గుడి కోసం ముందు అనుకున్న స్ధలం మీద కన్నెశాడా? అందుకోసమే ఇలాంటి విన్యాసాలు శివస్వామి చేస్తున్నాడా? అన్నది తెలియాల్సివుంది. పైగా అసలు బిల్డర్లు ఇంత వరకు జాడా పత్తా లేరు? కాని కొత్తగా తెరమీదకు వచ్చిన శ్రీధర్‌ రెడ్డి, దేవేందర్‌ రెడ్డిలు ఎవరు? సడన్‌గా విశ్వహిందూ పరిషత్‌ ప్రచారక్‌లు ఎలా ఇందులోకి వచ్చారు? బిల్డర్లకు బంధువులమని చెప్పుకుంటున్నారు? విశ్వహిందూ పరిషత్‌లో పనిచేసుకుంటూ ధర్మంకోసం, గుడి కోసం కాకుండా, బిల్డర్లకోసం పనిచేయడం ఎంత వరకు సమంజసం? వీటికి సమాధానం దొరికితే గాని అసలు గుడి సంగతి ఏం చేయాలనుకుంటున్నారో తేలిపోతుంది.

అత్త సొమ్మేదో అల్లుడు దానం చేసినట్లు గుట్ట కొని, దాని మీద వున్న గుడి కూల్చి, దేవుణ్ణి కింద దించి, అనాధగా విగ్రహాన్ని వదిలేసి, అక్కడ కడతాం…ఇక్కడ కడతాం…ఇంత స్ధలమిస్తాం…అంతిస్తామని భేరమేమిటి? అసలు దేవుడితో దోబూచులాటమేమిటి? ఈ భయం లేని పనులేమిటి? గుట్టు ఈ కనికట్టు చేసేంత అవసరమేమిటి? ఈ దోబూచులాటలెందుకు? వ్యాపారులు కనిపించకుండా దోచూచులాటమేమిటి? ఆ స్ధలం మాది? దాన్ని మేం కొన్నామని చెప్పలేనప్పుడు వారు చేసేది వ్యాపారం ఎలా అవుతుంది? అందులో నీతి వుందన్న భరోసా ఎలా కలుగుతుంది? ప్రభుత్వం ఇచ్చిందే నిజమైతే…వ్యాపారులు కొనుకున్నదే వాస్తవమైతే…బహిరంగంగా చెప్పుకోవడానికి అడ్డమేమొస్తుంది? నిజాయితీగా కొనుగోలు చేసి ఆలోచనేమిటి? కొన్న వాళ్లు కొనుగోలు చేయడం తప్పు కాదు. కాని అది మాది అని చెప్పలేనప్పుడు ఏదో తప్పు చేసినట్లే కదా? దోచూబులాడడం చూస్తేంటే ఏదో దాస్తున్నట్లు అర్ధమే కదా? ప్రజల ముందుకు రాకుండా పోవడానికి ఈ శషబిషలు పడుతున్నారంటే ఏదో మతలబు దాగున్నట్లే కదా? సహజంగా ఏ వ్యాపారి అయినా దాన్ని నిర్భయంగా చెప్పుకోగలగాలి? ఇంత వివాదం జరగుతుంటే అది మాది? అని చెప్పుకోలేని వ్యాపారులు రేపు ఎలా ప్లాట్లు చేసి అమ్ముకుంటారు? ఎలా నమ్మిస్తారు? ఈ వివాదాలు మరుగన పడేసి ఎలా వాటిని వ్యాపారంగా మల్చుకుంటారు? జనం ఎలా నమ్ముతారు? వాటిని ఎలా కొనుగోలు చేస్తారు?
ఇంత వివాదం ముసురుతున్న తర్వాత కూడా దాన్ని పూర్తి చేయగలరా? అమ్ముకునేంత నమ్మకం వ్యాపారులకు వున్నా, కొనుగోలు చేసేవారికి ధైర్యం వుండొద్దా? నమ్మకం కలుగొద్దా? వ్యాపారంలో దాపరికం మోసం కాదా? చేసేవారికి, చెప్పుకునే ధైర్యం లేని వారిని నమ్మి, కోట్లకు కోట్లు చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేస్తే, నష్టపోయేది ఎవరు? కబ్జాలపేరుతో జరుగుతున్న తతంగాలు ప్రజలకు తెలియవా? డాక్యుమెంట్లు మాత్రమే చూసి స్థలాలు కొనే కాలం పోయింది? నమ్మకం అన్నది ఎంతో మఖ్యమైపోయింంది? ఇంత జరుగుతున్నా కనీసం కస్టమర్లకైనా భహిరంగంగా నమ్మకం కల్గించే పని ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం తల్చుకుంటే ఏ స్థలాన్నైనా తీసేసుకోవచ్చు. పైగా ప్రభుత్వమే ఇచ్చిన స్థలం తీసుకోవడం పెద్ద పని కూడా కాదు. కొనుగోలు చేసిన వారు గుట్టను కొనొచ్చు. కొండను తవ్వొచ్చు. నేల మట్టం చేయొచ్చు. కాని రేపటి రోజు కొనుక్కున్న వాళ్లు రోడ్డున పడరన్న గ్యారెంటీ ఏమిటి? వివాదాలు ముసిరితే దాచుకోలేరు. వదిలేసి పోయే పరిస్ధితి వస్తే నెత్తిన తడిగుడ్డ వేసుకోక మానరు. ఇది వాస్తవం. అయినా మభ్యపెడతాం..మసి బూసి మారేడు కాయ చేస్తాం…అడిగిన వారిని అబాసు పాలు చేస్తాం…వారిని కొన్నామని, వారికి కోట్లు చెల్లించామని అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజాలౌతాయా? ఇలా ప్రజల్లో గందర గోళం చేసి, తాంబూలాలు ఇచ్చామని గుడి కోసం పోరాటం చేస్తున్నవారిలో చీలికలు తెచ్చి, ఉద్యమాన్ని పలుచన చేద్దామని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, సమస్యల మరింత జఠిలం చేసుకుంటున్నదే అసలు వ్యాపారులు. వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేని స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తే, ప్రజల నుంచి వచ్చే ఆరోపణలకు వివరణ ఇచ్చుకోకుండా, తెరవెనకు నాటకాలు ఆడితే సరిపోదు. ఎన్నటికైనా జనం ముందుకు వచ్చే రోజు వస్తుంది. అదే జనం చెప్పిందే చేయాల్సి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!