ఇంకెన్నాళ్లు నిరుద్యోగులు ఆత్మహత్యలు –
కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షులు కళ్లేపల్లి ప్రశాంత్
కేయూ క్యాంపస్, నేటిదాత్రి:ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కేయూ
బి ఎస్ ఎఫ్ అధ్యక్షుడు కళ్లేపల్లి ప్రశాంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం వలన ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్యలకి పాల్పడ్డారు , అలాగే మొన్నటికి మొన్న మహబూబాద్ జిల్లా వాసి నిరుద్యోగి ముత్యాల సాగర్ ఖమ్మం రైల్వే ట్రాక్ ఆత్మహ్యతకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అలాగే అతని కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నోటిఫికెషన్స్ రాకపోవడం వలన నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడే ప్రభుత్వం ఇంకా ఎంత మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల గురించి ఆలోచించే బదులు నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆలోచించి ఇకనైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.