ఆలయాలకు ఆధ్యాత్మిక వైభవం తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్

మంత్రి సత్యవతి రాథోడ్
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రక్కన వెంకట రమణా రెడ్డి సతీమణి జ్యోతి రెడ్డి సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా ,రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు శ్రీ ఎన్ వి మోహన రంగా చార్యుల పండిత బృంద వేద మంత్రోత్సరణల నడుమ స్వామి వారికి ప్రాణప్రతిష్ట చేశారు.సర్వాన్గా సుందరంగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ
ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతుంది.
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని 1,200 కోట్లతో పునర్నిర్మించారు.
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధికి 70 కోట్లు ఖర్చు చేశారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్లు ప్రకటించారు.
50 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, 100 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, 25 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది.
మన ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని ఆలయాలకు పునర్జీవం పోశారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,645
ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయగా, కొత్తగా 2,796 దేవాలయాలను చేర్చారు.
ఈ పథకం ద్వారా అర్చకుల వేతనాలను 6 వేల నుంచి 10 వేలకు పెంచుకున్నాం.
హిందువులు అని చెప్పుకునే వారు. వారు చేసే పనులకు సంబంధం లేదు.
సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నడుస్తున్నారు కాబట్టే..
ఈ రోజు ఇంత కర్చుపెట్టి గొప్ప ఆలయాన్ని నిర్మించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి సిద్ధు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ పట్టణ పార్టీ అధ్యక్షుడు జనార్ధన్ ఎంపీపీ లావణ్య భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు చైర్మన్ డ వాసుదేవ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!