స్వయంగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
హైదరాబాద్, జూన్ 11ః
తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్ ఆర్డీసీ) చైర్మన్ మెట్టు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ మొక్కనాటారు. చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌కు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ వి.ప్రకాశ్, తెలంగాణ భవన్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లళిత తదితర ప్రముఖులు స్వయంగా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారు సైతం మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వారందరి సమక్షంలో చైర్మన్ శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ… జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి సదా సర్వదా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ, ప్రజా కేంద్రక పథకాలు దేశమంతా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశయంలో తాను భాగస్వామ్యం అవుతానని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలో తీసుకువచ్చేందుకు, దేశంలో ప్రబల శక్తిగా మలిచేందుకు తాను శక్తివంచన లేకుండా ఒక సైనికుడిలా కృషి చేస్తానని వివరించారు. తన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, మున్నురుకాపు సంఘం నాయకులు బండి స్వరూప, ఆర్ అండ్ బీ ఈఎన్సీ(రాష్ట్ర రహదారులు), ఆర్డీసీ ఎండీ పి. రవిందర్‌రావు, డీసీఈ(స్టేట్ రోడ్లు) జె.దివాకర్, తెలంగాణ
గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాలియా నాయక్,
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు కొండ దేవయ్య, అపెక్స్ కమిటీ కన్వీనర్ పుట్టం పురుషోత్తం, మున్నురు కాపు మహిళా కన్వీనర్ బండి పద్మ, బోనాల శ్వేత, చందు, జనార్థన్, మున్నురుకాపు సంఘం వరంగల్ జిల్లా నాయకులు కూసం శ్రీనివాసులు, యువసాహితీవేత్త కడియాల సురేష్, ఆర్డీసీ కార్యాలయ సిబ్బంది సాన మల్లేషం, దామరాజు వంశీ, మాలోత్ సుధాకర్, మున్నురుకాపు జర్నలిస్టు ఫోరం లక్ష్మణ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.