వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగు ల అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణానికి విశ్రాంత ఉద్యోగులు మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో స్పందించి 15 లక్షలు నిధులు మంజూరు చేశారని జిల్లా బి ఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డికి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రెండవ అంతస్తు నిర్మించడం గర్వకారణమని ఆయన అన్నారు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు రామ్ రెడ్డి సత్యనారాయణ చారి రాఘవరెడ్డి శ్రీనివాసులు అంజయ్య రామచంద్రారెడ్డి ఉపేందర్ సత్యనారాయణ గౌడ్ గోపాల్ రెడ్డి భవనాన్ని పరిశీలించారు
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవనానికి 15 లక్షలు మంజూరు
