`ఒక ఉద్యోగికి సాధ్యమేనా?
`కనీసం కిరాయి కూడా కష్టమే కదా?
`ఆమెకు మాత్రమే ఎలా సాధ్యమైంది?
` ఉమ్మడి మూడు జిల్లాలనుంచి సమర్పణలు?
`నెల నెల టంఛన్‌గా మామూళ్లు?
` నేరుగా అందెదెవరికీ కనిపించదు?
` ఒక్క ప్రమోషన్ వస్తే చాలు…ఇక నాకు అడ్డే వుండదు?
` నాపై మాట్లేడే శక్తి ఏ ఉద్యోగికీ లేదు?
`వాళ్లచేత అవినీతి చేయించేది, కాపాడేదీ మేమే?
` పై స్ధాయిలో ఉన్నాం ఊదేస్తాం?
` మీడియా వందల సార్లు రాసింది..ఏమైంది?
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇలా ఒక శాఖలో పై స్ధాయిలో కూర్చున్న ఉద్యోగులు మాట్లాడుతుంటే కింది స్ధాయి అధికారులకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్లు? ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు!… అవినీతి సంపాదన అంటే అత్తగారింటి నుంచి అందే లాంఛనాలనంత సింపుల్‌గా వసూలు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించేవారిని కూడా పై స్ధాయిలో కూర్చొని వారిచేత అవినీతిని కొందరు ప్రోత్సహిస్తున్నారు?
ఆ అధికారి ఉద్యోగం కరీంనగర్. అదనపు బాద్యతలు రంగారెడ్డి, ఆదిలాబాద్. అయినా ఆమె నివానముండాల్సింది కరీంనగర్. కాని వుండేది హైదరాబాద్. కార్యాలయాలకు వచ్చేది లేదు? కార్యాలయాల్లో కూర్చొని ఫైళ్లు చూసేది లేదు? అదనపు బాధ్యతల పేరుతో తిరుగుతున్నట్లు చెప్పుకోవాలి. హైదరాబాద్‌లో ఉంటూ మామూళ్లతో వచ్చిన ఫైళ్లు క్లియర్‌చేయాలి? అయితే ఇక్కడే అసలు గుట్టు దాగి వుంది. హైదరాబాద్‌లో ఇల్లు సామాన్యమైంది కాదు. అసామాన్యమైంది. అదో అందమైన, అతి ఖరీదైన భవంతి? ఆ ఏరియాల్లో అతి సంపన్నులు మాత్రమే ఉండగలిగే ప్రాంతం. ఎంత లేదన్నా ఆ విల్లా ఖరీదు రూ.6 కోట్లుకుపైగానే వెచ్చించి, చెల్లించి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అందుకే ఆమె అక్కడి నుంచి కదలరు. విధులు కూడా అక్కడ నుించే నిర్వహిస్తారు. ఇటీవల కరోనా కాలం కావడం కూడా కలిసి వచ్చినట్లుంది? ఇదో సాకు కూడా ఉపయోపగడుతోందన్నది ఉద్యోగులు చెప్పుకుంటున్న మాట. సహజంగా ఒక ఎంత పెద్ద ఉన్నతోధ్యోగి అయినా అంత పెద్ద, ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయడం సాధ్యం కాని పని. అంతే కాదు అలాంటి ఇంటికి కిరాయి చెల్లించడం కూడా అసాధ్యమే. కాని ఆమెకు సాధ్యమౌతోంది. కిరాయి చెల్లించేందుకు కాదు…ఏకంగా కొనుగోలు చేసి నివాసముంటోంది? మరి ఒక అధికారికి ఇంత సంపాదన ఎలా సాధ్యమన్నది మాత్రం ఆ శాఖ చూస్తున్న పెద్దలే చెప్పాలి.
తప్పు చేస్తే క్షమించేది లేదని ప్రభుత్వం హెచ్చరిస్తూనే వుంది. రిజిస్ట్రేషన్ శాఖ కమీషనర్ అవినీతిని సహించని, చీల్చి చెండాడే చండశాసనుడు. అయినా సరే ఆయనేం చేయలేరని ఓ ఉన్నతాధికారి ఉద్యోగులతోనే చెబుతోందని తెలిసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్‌తో ఐజిని అవుతానంటున్నారు. ఇప్పటికే నా చేతిలోనే మూడు జిల్లాలున్నాయి. ఎవరైనా తప్పు చేసి పట్టుబడితే విచారణ చేసే స్ధాయిలో ఉన్న నాపై విచారణ అన్నది అసాధ్యమైన విషయం. ఐజి కూడా నన్ను ప్రశ్నించలేరు. వివరణ అడిగే పరిస్థితి లేదు. అయినా మేం నేరుగా ఎక్కడా రూపాయి తీసుకున్నట్లు కనిపించదు. కింది స్ధాయినుంచి వచ్చే వాటాలు, వసూళ్లు, మమాళ్లు గురించి అందరికీ తెలిసిందే…వాటిపై మీడియా అనేక సార్లు రాసిందే…ఏమైంది? నా ఉద్యోగానికేమైనా ఇబ్బందైయ్యిందా? నాకు నోటీసులైనా ఇచ్చారా? ఇవ్వడానికి పైన ఎవరూ లేరు? మేమే సుప్రిం? మేం చెప్పిందే వేదం? మేం రాసిందే లెక్క? మేం చూపించిందే ఆదాయం? మేం ఎవరికి సర్టిఫికెట్ ఇస్తే వాళ్లే ఉద్యోగులు? కేసులున్నా సరే…మా ఆశీస్సులుంటే చాలు…వారికి మేం రక్ష…వారి నుంచి మామళ్లు వసూళ్లు మాకు సంపాదన. ఇదీ కరీంనగర్ రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న తంతు…
కొందరు అధికారులు తప్పు చేయడం కూడా తమకున్న హక్కు అన్నంత దోరణిలో వున్నారని అంటున్నారు. తప్పు చేస్తున్నామన్న కించిత్ భావన కొంత మందిలో ఉద్యోగుల్లో లేనట్లుంది. నేరం చేస్తున్నామన్న భయం లేదు. శిక్షను అనుభవించాల్సివస్తుందన్న బాధ లేదు. ఎందుకంటే ఉన్నత స్ధాయిలో వున్న తమను పట్టుకునే అవకాశం లేదని వారి నమ్మకం. అతి విశ్వాసం. కిందిస్ధాయి ఉద్యోగులు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపు శాఖ ఆదీనంలో అనేక కార్యాయాల్లో కింది స్ధాయి ఉద్యోగులు సాంపు పేపర్లు మాయం చేయడం తెలిసిందే. లక్షలకు లక్షలు లూటీ చేసింది వింటున్నదే. అలాంటి ఉద్యోగుల చేత చేయించాల్సిన తప్పులు చేయిస్తున్నది పై స్ధాయిలో వున్న కొంత మంది ఉద్యోగులే అన్నది చిరుద్యోగుల వాదన. ఏ కింది స్ధాయి ఉద్యోగి అంతటి ధైర్యం చేసే ప్రసక్తి వుండదని, నయానో, భయానో చేయించేది పై స్ధాయిలో వున్న వాళ్లే అన్న ప్రచారం కూడా వుంది. కింది స్ధాయి ఉద్యోగులు పై స్దాయి వాళ్లు చెప్పినట్లు వినకపోతే ఏదో రకంగా ఇరికిస్తారు? అదో భయం. వింటే ఏదోనాడు ఎప్పుడో ఒకనాడు దొరుకుతాం? కాకపోతే మళ్లీ కాపాడేది వాళ్లే కదా? అన్న నమ్మకంతో కూడా ఉద్యోగులు తప్పు చేస్తున్నారని అంటున్నారు. అయితే వాటాలు పంచుకున్నప్పుడు పెద్ద చేతులతో తీసుకునే పై స్ధాయి ఉద్యోగులు, దొరికనప్పుడు మొత్తం కింది స్ధాయి ఉద్యోగుల నుంచే వసూలు చేయిస్తుండడంతో చిరుద్యోగులు బలైతున్నారు. ఆపై తప్పు చేయకుండా వుండేలేకపోతున్నారు? పై స్ధాయికి నెల నెలా మామూళ్లు వసూళ్లు చేసి పంపక మానలేకపోతున్నారు. ఇదే ఈ కరీంనగర్ జిల్లా స్ధాయి ఉన్నతాధికారికి వరమైంది. గతంలో దొరికి, దోషిగా నిలబడ్డాడు సురేష్. మళ్లీ అధికారి ఆశీస్సులతో ఉద్యోగంలో చేరాడు. ప్రమోషన్ కూడా కొట్టేశాడు. ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో వున్న రిజిస్ట్రేషన్ కార్యాలయానుంచి మమూళ్లు వసూలు చేసి, నెల నెల అందించే బాధ్యతలో సురేష్ తరిస్తున్నాడని శాఖలోని అనేక మంది అధికారులు కోడై కూస్తున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు సురేష్ చేతికే విచారణ ఫైలు అందించి, ఆయన చేతే మామళ్లు వసూలుచేయించి, నెల నెల దండుకోవాల్సింనంత దండుకుంటున్న అధికారి తనను ఎవరూ ఏం చేయాలేరని కూడా అంటోందట?. కమీషనర్ ఏం చేయలేడని అంటోందని ఉద్యోగులే చెబుతున్నారు. ఒక్క ప్రమోషన్‌తో ఇక ఐజిని కావడమే వుందని అంటున్నారట. కమీషనర్‌కూడా నన్ను ఒక్క మాట కూడ అనలేని స్ధాయిలో వుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి ఆమె ధైర్యమేటిటో? ఆ లెక్కేంటో ప్రభుత్వం తెలుసుకుంటే గాని అసలు బాగోతం బైట పడదు. ఆమె ఆగడాలకు , మమూళ్ల బండారం తెరతీయబడదు. ఇలా ఒకరిని చూసి ఒకరు రిజిస్ట్రేషన్ శాఖలో ఖజానేకే కన్నం పెడుతుంటే వారిని శిక్షించేవారే లేకపోతే విజిలెన్స్ అనేది ఎందుకు? ఆ పేరుతో అదే పెద్దలకు విచారణ బాధ్యతలు అప్పగించడం ఎందుకు? మరింత దోచుకొమ్మని దారి చూపడానికా? అయినా ఇలా విచ్చలవిడి సంపాదన జరుగుతుందని తెలిసినా పట్టించుకోకపోవడంలో ఆ శాఖ ఉద్దేశ్యమేమిటో కూడా ప్రజలకు తెలియాల్సిన అసవరం లేదా? ప్రభుత్వం ఇకనైనా దృష్టిపెట్టకుండా వుంటే ప్రజలు తిట్టుకునేది ముందు ప్రభుత్వాన్నే…ఆ తర్వాతే ఉద్యోగులను అన్నది తెలుసుకోలేకపోతే…మేలుకోకపోతే ప్రభుత్వ ఖజాన ఆగమౌతుంది. అధికారపార్టీకే తీరని నష్టం ఏర్పడుతంది. ఒక్కసారి అటు వైపు చూడండి. సంబంధిత మంత్రి జోక్యం చేసుకుంటేగాని పరిస్థితుల్లో మార్పు రాదు. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష నాయకులు కూడా స్పందిస్తేగాని రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగి అవినీతికి అడ్డుకట్ట పడదు.