* గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్….
కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట గ్రామానికిచెందిన నిరుడి స్వామి ఇటీవల కరెంట్ షాక్ తో బోరుబావి దగ్గర మృతి చెందిన
విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నీరుడు స్వామి దిశకర్మకు స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు కలిసి మరణించిన వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం తో పాటు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఈ ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ మానవత్వానికి చిరునామగా నిలుస్తున్న యువ నేత స్వర్ణలత భాగ్యరాజ్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు.