ఆదివాసుల స్ఫూర్తిదాత హైమన్ డార్ప్ వర్థంతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల పై జరిపిన అధ్యయనం వీరి పరిశోధన అపారమైనది. క్రిస్టఫర్ వాన్ ప్యూరర్ హైమన్ డార్ప్ సేవలను మరవనిది. ఆదివాసులు నేడు వీరి 37వ వర్ధంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1909వ సంవత్సరం జూన్ 11న జన్మించారు. లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ మరియు ఆఫ్రికన్ స్టడీస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తూనే తన సహా ఉద్యోగి అయినా ఎలిజియత్ బర్నాల్డో బెట్టిని (ఈమె 1911 బ్రిటన్ లో జన్మించి 1987 జూన్ 11న హైదరాబాదు నగరంలో మరణించారు) వీరిని వివాహం చేసుకున్నారు. భారత దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తెలంగాణలో నిజాం పరిపాలన వారి చట్టాలు, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జల్-జంగిల్-జమీన్ (నీరు- అడవి-భూమి) భుక్తి కొరకై ఆదివాసుల హక్కులను కాలరాస్తూ నిజాం సైన్యం అగడానికి వ్యతిరేకంగా, అటవీ ఉత్పత్తుల పైన పన్నులు, ఏజెన్సీలో వలసలు, వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు, అటవి శాకారుల నిర్బంధాలు, గ్రామ పట్వారిల, మోసాలు, ఆదివాసులు బలి కావడం, తమ హక్కులకై, ఆదివాసుల అస్తిత్వం కొరకై, వారి సంస్కృతి భాష పరిరక్షణకై 1940 సంవత్సరంలో కుమురం భీమ్ రాజ్ గోండ్ ఆధ్వర్యంలో జోడేఘాట్ ని కేంద్రంగా చేసుకొని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా గేరిల్లా పద్ధతిలో తమ జాతి బిడ్డలను ఏకం చేసి ధర్మం కొరకై తిరుగుబాటు ఎగురవేసినాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసి జాతిని జాతిని ఏకం చేసి పోరాడుతూ వారిలో చైతన్యవంతం చేశారు ఇలాంటి సమయంలో నిజాం ప్రభుత్వం తన సైన్యం చేసిన దాడిలో ఎంతోమంది ఆదివాసి బిడ్డలు తుపాకీ తూటలకు బలిఅయినారు. తమ నేత్తురు అడవి తల్లికి సమర్పించి అసలుబాసినారు. ఇంతటి వ్యతిరేకతకి గల కారణాలు వీరి అశాంతికి ఇంతటి ఈ వ్యతిరేక గల కారణాలు ఈ ఆశాంతికి మూలాలు ఏంటని నిజాం రాజు దృష్టిలో పెట్టుకొని దీని పరిష్కారానికి క్రిస్టోఫర్ హైమన్ డార్ప్ నిజాం ప్రభుత్వం సలహాదారులుగా సూచనల కొరకు నియమించారు. తన ధర్మపత్ని అయినా ఎల్జిబియత్ బెర్ణల్డ్ బెట్టిలు కూడా తనతో కలిసి ఆదివాసి అదిలాబాద్ జిల్లా అడవిలో పర్యటించి రాజు గోండ్స్ మరి ఇతర ఆదివాసుల యొక్క భాష గోండి నేర్చుకుని వారితో మమేకమై సమస్యల్ని అన్వేషించి, సమస్యలను గుర్తించి జనజీవనం, అటవీ జీవనం ఆర్థిక పరిస్థితులు, నిజాం అధికారుల తీరు నిజాం సైన్యం ఆగడాలకు, ఆదివాసులకు వ్యతిరేకంగా ఉన్నావని భావించి వాటిని అధ్యయనం చేసి ఆదివాసీల, గిరిజనుల వారి సమస్యలు పరిష్కారానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని రిపోర్టు రూపంలో తయారుచేసి నిజాం రాజుకు అందించడం జరిగింది. కానీ నిజాం రాజు చాలా వరకు వాటిని అమలుపరచలేదు. ఇలాంటి సమయంలో తనకు ఆదివాసుల యొక్క సంస్కృతి నచ్చడంతో వారితో మమేకమై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వాసులతో ఆదివాసుల సాంప్రదాయాలు, సంస్కృతి, భాష పండుగలు, వ్యవసాయము, పంటలు, వైద్యము ఆయుర్వేదము ఇతర విషయాల్ని పరిశోధించి అధ్యయనం చేసి ఆదివాసుల సమస్యలకి ఒక వేదిక ఉండాలని తలంచి తరతరాల నుండి వస్తున్నా కేస్లాపూర్ లో గల నాగోబ జాతరలో ఆదివాసుల సమస్యలకై ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ సమస్యలను విన్నవించి సమస్య పరిష్కారానికై ”ప్రజా దర్బార్” అనే సభను ఏర్పాటు చేసినాడు. నాటి నుండి నేటి వరకు ఈ ప్రజా దర్బార్ నాగోబా జాతరలో కొనసాగుతూ వస్తున్నది. ఆదివాసుల సమస్యలపై పరిశోధన చేసి చాలా గ్రంథాల్ని అచ్చు వేయించాడు. అలాగే హైమన్ డార్ప్ నేపాల్ నుండి ఈశాన్య భారతదేశం మొదలుకొని తెలంగాణలోని చెంచులు, ఆదివాసులు, కోయలు, రాజు గోండ్స్, కోలామ్స్, కోండరెడ్లు వారి జీవన విధానంపై పరిశోధన చేసి అనేక పుస్తకాలను ముద్రించాడు. అలాగే ఆదివాసులతో మమేకమై వారి యొక్క సమస్యల్ని పరిష్కారం తన యొక్క సమస్యగా భావించి ఆదివాసుల్లో కలిసిపోయాడు. దేశంలోనే గిరిజన తెగల ఆర్థిక సామాజిక మార్పు గురించి పనిచేశారు. డాక్టర్ మైకల్ యార్క్ లో కలిసి ఉమ్మడిగా అధ్యయనం చేశారు. ఇందులో గోండులు వారి యొక్క ఖర్మకాండాలు, పౌరాణిక కథనాలు విషయాలలో మార్పులు బహుశాల్పం 35 సంవత్సరాలు గోండ్ సమాజం యొక్క అభివృద్ధి తీరుతెన్నులు గుర్తించి క్షేత్ర పరిశోధన సాధ్యం కావడానికి వీరికి బ్రిటన్ యొక్క సాంఘిక, సైన్స్ పరిశోధన కౌన్సిల్ వారి గ్రాంటులు, లేనర్ హ్యూమ్ ట్రస్ట్ వారి నిధులు మరియు లెన్నర్ గ్రేన్ ఫౌండేషన్ ఆంథోపాలజికల్ రీసెర్చ్ వారి నిధులు కూడా ఈయన పరిశోధనకు చాలా ఉపయోగకరమైనవి. ఆదివాసి గిరిజనుల పోడు వ్యవసాయం అటవి హక్కులు, వ్యవసాయ భూముల కమతాలకి పట్టాలు ఇవ్వకపోవడం, సాగునీరు, తాగునీరు, వసతుల సౌకర్యాల గురించి, అటవి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాల కల్పన, విద్యా, వైద్యం, వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను, క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర రూపం దాల్చి ఒక రిపోర్ట్ తయారు చేశారు. తన కుమారునికి ”లచ్చు పటేల్” అనే ఆదివాసి వ్యక్తి పేరు పెట్టుకున్నాడు. ఈయన 1995 వ సంవత్సరంలో తన 85 ఏట లండన్ నగరంలో పరమపదించారు. తన తండ్రి చివరి కోరికని మన్నించి పిల్లలు తన అస్థికలను తెలంగాణ రాష్ట్రంలోని మర్లవాయి గ్రామంలో కననం చేయవలసిన కోరడంతో తన కుమారులు అక్కడే మర్లవాయిలోనే కననం చేశారు. తాను నివసించిన ఇల్లు (గుడిసె) ఇప్పటికి అలాగే ఉంచి తన జ్ఞాపకార్థం గ్రామస్తులు కాపాడుకుంటున్నారు. 1995 సంవత్సరంలో తన 85 ఏటా లండన్ నగరంలో పరమపదించారు.

మర్లావాయి గ్రామంతో గల అనుబంధం: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తాను చేసినటువంటి అధ్యయనానికి ముఖ్యంగా మార్లవాయిలోనే ఉంటూ తన అధ్యయనం కొనసాగించారు. మర్లా వాయి తో హైమన్ డార్ప్ కు అనుబంధం ఉంది. మర్లవాయి గ్రామానికి హైమన్ డార్ప్ స్ఫూర్తిదాత. ఈయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి జరుపుతున్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాల చారిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధికై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వారు మర్లవాయిలో 18 లక్షలతో అమౌంట్ తో స్మృతి వనం ఏర్పాటు చేసి దీంట్లో హైమన్ డార్ప్ దంపతుల యొక్క జీవిత విశేషాలు మరియు ఫోటోలు ఏర్పాటు చేశారు. ఆదివాసుల ప్రముఖమైనటువంటి గుస్సాడీ నృత్యం శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం 20 లక్షలతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని రోడ్లకు హైమన్ డార్ప్ వీధి పేరు పెట్టినారు అలాగే బెట్టీ వీధి, హైమన్ డార్ప్ పేరు తో లైబ్రరీకి వారి నామకరణం చేశారు. వీరి వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఆటల పోటీ నిర్వహించి గెలు పొందిన వారికి పథకాల అందిస్తున్నారు. గ్రామంలోని యువజన సంఘానికి హైమన్ డార్ప్ యూత్ క్లబ్ గా నామకరణం చేసి యువకులు సేవలందిస్తున్నారు. గత ఏడాది మర్ల వాయి గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైంది. యువకులైన కనక ప్రతిభ వెంకటేష్ సర్పంచ్ వారి కృషి ఫలితంగా గ్రామం సర్వ అభివృద్ధిలో కొనసాగుతుంది. గ్రామానికి చెందిన కనకరాజుకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గుస్సాడి నృత్యానికి అందించినది.

వ్యాసకర్త:-
డా.తూము విజయ్ కుమార్
చరవాణి: 9492700653

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!