జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య, ఆదేశానుసారం జనగామ జిల్లా ఘనపూర్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులను శాలువా కప్పి సన్మానించి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని బట్టి గుజ్జరి రాజు, మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై రైతాంగం ఉద్యమించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమ కేరటాలని మనకు ఉద్యమాలు కొత్తేమీ కాదని కేంద్ర ప్రభుత్వం పై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. అదే విధముగా రైతుల పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. ఉడకబెట్టిన బియ్యాన్ని కొనం అనే సాకుతో రైతులను ఆయన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ప్రతి పంటలను రైతులు అమ్ముకునే విధంగా చట్టాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.
అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతాంగం కష్టాలు వారు ఎదురు కొంటున్న నష్టాలన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.అంతేకాకుండా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ప్రభుత్వాలు ప్రోత్సహించి, వారికి అండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, స్టేషన్ ఘనపూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, మార్కెట్ డైరెక్టర్లు బత్తుల రాజన్ బాబు, పెంతల రాజ్ కుమార్, చల్లారపు శ్యామ్ సుందర్, చిగురు సరిత-ఆంజనేయులు, సుప్రియ, పిఏసిఎస్ డైరెక్టర్ తోట సత్యం, శివునిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు బాలరాజు, ఏసుబాబు మార్కెట్ సిబ్బంది, రైతులు, హామలీలు పాల్గొన్నారు.