వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడాలని అదేవిధంగా నేరాలను అరికట్టడానికి జిల్లా ఎస్పీ కె రక్షితమూర్తి ఆదేశాల మేరకు డి.ఎస్.పి ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో బీసీ కాలనీలో 120 ఇళ్ళను తనిఖీలు నిర్వహించామని డి.ఎస్.పి విలేకరులకు తెలిపారు అదేవిధంగా 51 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఒక టాక్టర్ను పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు వాహనాల యజమానులు సరైన పత్రాలు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో చూపించి తీసుకువెళ్లాలని ఆయన కోరారు ఈ తనిఖీలలో ఆత్మకూరు సిఐ రత్నం కొత్తకోట సిఐ శ్రీనివాస్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు అని ఆయన తెలిపారు
ఆత్మకూరులో వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
