ఆట…ఆడుకుంటున్నారు!

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట లేకుండా చేస్తున్న కేటిఆర్‌, హరీష్‌ రావుపై ప్రశంసలు కురిపిస్తూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి చిట్‌ చాట్‌…

`ప్రతిపక్షాలు నోరుమెదపలేకపోతున్నాయి.

`ప్రతిపక్షాలకు ప్రశ్నలు కరువౌతున్నాయి.

`అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

`మంత్రులు కేటిఆర్‌, హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు.

`ప్రతిపక్షాలు గుక్కతిప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు.

`ఇద్దరూ ఇద్దరే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.

`సందర్భోచిత సమాధానాలతో ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేస్తున్నారు.

`ప్రతిపక్షాలు చేసే అనవసర రాద్దాంతాలను అసందర్భ ప్రేలాపనలుగా చిత్రీకరించి ఇరుకునపెట్టేస్తున్నారు.

`ఏ మాట్లాడాలో అర్థం కాక బిజేపి సభ్యులు కార్యాలయ కేటాంపు గురించి ప్రస్తావన తెచ్చారు.

`గవర్నర్‌ ప్రసంగానికి తీర్మానంలో కేటిఆర్‌ ప్రతిపక్షాలను కిమ్మనకుండా చేశారు.

`తనదైన శైలిలో వన్‌ మాన్‌ షో చేశారు.

` రఘునందన్‌ మ్యానిఫెస్టో చదివి నోరుమూయించాడు.

`అక్బరుద్దీన్‌ పై అసహనంపై తనదైన పంచులు విసిరారు.

`బడ్జెట్‌ మీద చర్చలో హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చక్కలు చూపించారు.

` బిజేపి నుద్దేశించి మన్‌ కి బాత్‌ మీది, జన్‌ కి బాత్‌ మాది అంటూ చురకలంటించాడు.

`ఈటెల రాజేందర్‌ మాట్లాడిన మాటలు అసెంబ్లీ లో వినిపించి నోరు మూయించారు.

` ఈటెల ఎక్కడున్నా మా వాడే అని ఇరుకున పెట్టారు.

`దేశం నలు దిక్కులు కోరుకుంటున్నది బిఆర్‌ఎస్‌ సర్కార్‌ అని చెప్పి ఊపు నందించారు.

`మొత్తంగా ఇద్దరూ కలిసి అసెంబ్లీ చరిత్రలో కొత్త అధ్యాయం రచించారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజలు తెలుసు…ప్రజల కష్టం తెలుసు…తెలంగాణ ప్రజలు పడిన గోస తెలుసు. ఉద్యమాలు తెలుసు..పోరాటాల రూపాలు తెలుసు. ప్రజలకు ఎలా చేరువవ్వాలో తెలుసు. ప్రజలతో ఎలా మమేకమౌవ్వాలో తెలుసు. ప్రజల మధ్య ఎలా మసలుకోవాలో తెలుసు. ప్రజలకు ఎలా దగ్గరవ్వాలో తెలుసు. ప్రజా సమస్యలు తెలుసు. వాటికి పరిష్కారం తెలుసు. ప్రజలు ఏంకోరుకుంటున్నారో తెలుసు. ప్రజలు ఏం చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయో తెలుసు. మొత్తంగా ప్రజల నాడి తెలుసు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలుసు. ప్రజల గుండెల్లో నిలిచిన వాళ్లు…ఇద్దరూ ఇద్దరే…ఒకరు మున్సిపల్‌శాఖ, ఐటి మంత్రి కేటిఆర్‌, ఆర్ధిక, వైద్య శాఖమంత్రి హరీష్‌రావు. ప్రజలకు ఎంతో చేరువైన నాయకులు. ప్రజల సంక్షేమం కోరుకునే నాయకులు. పాలనలో చాణక్యులు…రాజకీయాల్లో రాటుదేలిన వ్యూహకర్తలు..ప్రజా దీవెనలతో తిరుగులేని నాయకులుగా ఎదిగిన వాళ్లు…ఎదురులేని రాజకీయం చేయడంతో ప్రజల మద్దతు మెండుగా వున్న వాళ్లు…ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో బాగస్వాములు…బంగారు తెలంగాణ ఆవిష్కరణలో రెండు కళ్లు…! అని చెబుతూ ప్రజల్లో మంత్రులు కేటిఆర్‌, హరీష్‌రావుల సమర్ధవంతమైన నాయకత్వంపై నేటిధాత్రి ఎడిటర్‌ కటారాఘవేంద్రరావుతో ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చిట్‌ చాట్‌…

 సహజంగా అసెంబ్లీ సమావేశాలు అనగానే ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకొని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, ఎండగట్టడం, నిందించడం, ప్రభుత్వాల అసమర్థతను అసెంబ్లీ వేధికగా ఎండగట్టడం గతంలో చూశాం..

.కాని తెలంగాణ వచ్చాక, ప్రతిపక్షాలకు ప్రశ్నలు లేని పాలన సాగుతోంది.సంక్షేమం అమలు చేయబడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఈ ఎనమిదేళ్ల కాలంలో వచ్చిన సంక్షేమ పథకాలు నభూతో నభవిష్యతిగా కొనసాగుతున్నాయి. సంక్షేమ పాలనకు కేరాప్‌ అడ్రస్‌గా తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ రూపంలో ఇన్ని సంక్షేమ పధకాలు అమలు చేయొచ్చన్న ఆలోచన గతంలో ఏ పాలకులు చేసింది లేదు. దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులోనుంచి పుట్టిన అనేక మానసపుత్రికలైన పథకాలు దేశంలో అనేక రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. ఒకటా, రెండా ప్రపంచంలో ఇన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణ ప్రభుత్వంలో వున్న ఇద్దరు సమర్ధవంతమైన నాయకుల నేతృత్వంలో కూడా పాలన బంగారు తెలంగాణ వైపు సాగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలు, పధకాల సృష్టితో మొదలైతే వాటి అమలులో ప్రత్యేక శ్రద్ద కనబర్చి అమలు చేస్తున్న నాయకుల్లో ఈ ఇద్దరు ముందు వరసలో వున్నారు. ఇద్దరూ ఇద్దరే…తెలంగాణ ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయగల నాయకులు ఈ ఇద్దరూ…ఈ బడ్జెట్‌ సమావేశాలలో వారి నాయకత్వ పటిమ చూసి, తెలంగాణ అబ్బుర పడుతోందంటే అతిశయోక్తి కాదు. 

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ జరిగిన నాడు మంత్రి కేటిఆర్‌ ఒక్కడే అసెంబ్లీలో వన్‌మాన్‌ షో చేశారు.

ప్రతిపక్షాలతో చెడుగుడు ఆడుకున్నారు. ప్రతిపక నాయకులు మాట్లాడిన మాటలకు సమాధానాల్చిన సందర్భంలో కేటిఆర్‌ విశ్వరూపం చూడడం జరిగింది. ముందుగా ఎంఐఎం నాయకుడు అక్భరుద్దీన్‌ ఎంతో ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని దాన్ని ఎంతో చాకచక్యంగా కేటిఆర్‌ ఎదుర్కొన్నారు. అక్భరుద్దీన్‌కు మరో మాట లేకుండా చేశాడు. ఇక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రభుత్వం మీద ఎంతో విరుచుకుపడుతున్నానన్నట్లు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో స్పందించిన కేటిఆర్‌ దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్‌ రావు ఇచ్చిన హామీల చిట్టా చదవి, అసెంబ్లీ సాక్షిగా ఆయన పరువు తీశారు. అసలు అలవి కాని హామీలు ఇచ్చిన రఘునందన్‌రావు ఒక్కటంటే ఒక్క పని చేశాడా? అని నిలదీశాడు..భబ్రాజ మానం భజగోవిందం… అంటూ ఎద్దేవా చేశాడు. దాంతో రఘునందన్‌ మ్యానిఫెస్టో ఇలా వుందా? అనేది ప్రపంచానికి తెలిసింది. ప్రతి ఇంటికి రెండు ఎడ్లు, తన నియోజకవర్గంలో వున్న యువతకు నిరుద్యో భృతి ఇలాంటివి తక్షణం అమలు చేస్తానని చెప్పారు. అవి ప్రభుత్వ సహాకారంతో జరగాల్సిన పనులు. కాని ఏ ఒక్క ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తీర్చేవికాదు. కేవలం ఎన్నికలలో గెలిచేందుకు రఘునందన్‌ ఇచ్చిన అలవి కాని హమీలు. వాటిని చెప్పి బిజేపి నాయకుల పరువు తీశారు. ఇక ప్రధాని మోడీ దేవుడు…దేవుడు అంటూ కీర్తించడం ఏమిటన్నదానిపై అసెంబ్లీ సాక్షిగా బిజేపిని కేటిఆర్‌ ఆటాడుకున్నాడు. మోడీ పేదల దేవుడెలా అయ్యాడని నిలదీశాడు…సిలిండర్‌ ధర పెంచినందుకు దేవుడయ్యాడా? పెట్రోల్‌ రేట్లు పెంచి దేవుడయ్యాడా? తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వనందుకు అయ్యాడా? ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వనందుకు దేవుడయ్యాడా? కనీసం ఒక్క నర్సింగ్‌ కాలేజీ కూడ ఇవ్వకపోవడంతో దేవుడయ్యాడా? అంటూ బిజేపిని కేటిఆర్‌ తూర్పారపట్డారు. 

బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో మంత్రి హరీష్‌రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు. 

అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగేలా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్రతిపక్షాలను ఆటాడుకుంటున్నారు. ప్రతిపక్షాలను ఇద్దరూ కలిసి గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా బిజేపిని హరీష్‌రావు టార్గెట్‌ చేసి మాట్లాడిన తీరు, మాజీ మంత్రి ఈటలపై వేసిన పంచులతో సభలో నవ్వులు పూయించారు. తెలంగాణ అభివృద్దిని కవిత రూపలంలో వివరించి, ఆధ్యంతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ లేవనెత్తిన అంశాలపై సభలో రసవత్తరమైన చర్చ దిశగా తీసుకెళ్లారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెబుతూ మంత్రి హరీష్‌రావు , హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. అసలు దళిత బంధు అమలయ్యేది కాదని ఎద్దేవా చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో ఈటెల రాజేందర్‌ చెప్పాలన్నారు. ఈటెల రాజేందర్‌ తమ వైపు వున్నప్పుడు బాగానే వున్నారని, బిజేపిలోకి వెళ్లి తనలో మార్పు తెచ్చుకున్నారని చురకలంటించారు. నాయకుడు పార్టీ మారినంత మాత్రాన మనసు మారడంలో అర్ధం లేదన్నారు. తన నోటితో తాను గతంలో ఈటెల రాజేందర్‌ మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా వినిపించి ఈటెల పరవు తీసేశారు. ఎక్కడున్నా ఈటెల మా వాడే అంటూ, బిజేపిలో చేరి మన్‌కీ బాత్‌కు అలవాటు పడ్డాడని, జన్‌కీ బాత్‌ వినడం మర్చిపోయాడని అనడంతో సభలో నవ్వులు విరిసాయి. ఇక ఈటెల రాజేందర్‌ ఏం మాట్లాడాలో కూడా బైటకు వెళ్లి ఇప్పుడే ప్రిపేర్‌ అయి వచ్చిన సంగతి తెలుసంటూ నవ్వుకుంటూనే తీయాల్సిన పరువు తీశారు. దాంతో ఈటెలతోపాటు అందరూ నవ్వుకున్నారు. అయితే ఈ చర్చలో పాల్గొని అనవసరమైన విషయాలు తవ్వుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో! గాని ఈటెల రాజేందర్‌ బిజేపి సభాపక్ష కార్యాలయం గురించి సభలో చర్చించి, చర్చను పక్కదోవ పట్టించాలని చూశాడు. కాని దాన్ని కూడా మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టి తనదైన శైలిలో అసెంబ్లీలో వన్‌మాన్‌ షో చేశాడు. ఇద్దరు నాయకులు వరుసగా అసెంబ్లీ వేధికగా ప్రతిపక్షాలను ఎండగట్టిన తీరు గతంలో ఎన్నడూ చూసింది లేదని సభ్యులు చర్చించుకున్నారు. ఇద్దరు నేతలు ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేయడంలో సఫలీకృతమయ్యారని, అదే సమయంలో ప్రభుత్వ పనితీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారన్న చర్చ ప్రతిపక్షాలలో కూడా సాగుతోందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!