సిపిఐ డిమాండ్
కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
గృహలక్ష్మి పథకంలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరు చేయాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని డిప్యూటీ తాసిల్దార్ సాంబశివుడు కు అందజేశారు.ఈ సందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఐదు లక్షలతో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ అటకెక్కిందని విమర్శించారు.గతంలో ఇండ్ల మంజూరు కోసం అనేకమంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఇప్పుడు వాటి జాడే లేదన్నారు.సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశపడ్డ నిరుపేద ప్రజలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని అన్నారు.తాజాగా గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకొనుటకు మూడు విడతలుగా మూడు లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.ఇల్లు నిర్మాణానికి అవసరమైన ఇసుక,ఇటుక,ఇనుము విపరీతంగా రేట్లు పెరిగాయని ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షలతో ఇల్లు నిర్మించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.గతంలో డబుల్ బెడ్ రూమ్ కు 5 లక్షల రూపాయలు కేటాయించి ప్రస్తుతం మూడు లక్షలు కేటాయించడం సబబు కాదన్నారు.నిజంగా ప్రభుత్వానికి నిరుపేదలకు ఇల్లు కట్టించాలనే తపన ఉందా? అని అన్నారు.సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణానికి ఆరు లక్షలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ఇల్లు నిర్మాణానికి అవసరమైన వస్తువులను ప్రభుత్వమే పంపిణీ చేయాలన్నారు.ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారుల సమక్షంలో గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.ఇండ్లు అరకొర ఇవ్వకుండా అర్హులైన వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వడ్డే బోయిన లక్ష్మీనరసయ్య,దాసరి లింగస్వామి,పిన్నోజు బాలా చారి,శ్రీను,నగేష్,యాకయ్య,గణేష్