అమితాషా 58వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన బెంద్రం తిరుపతిరెడ్డి..

ఇల్లంతకుంట :నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమితాషా జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి, స్వీట్ల పంపిణీ చేసిన బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ. మహారాష్ట్రలో అనిల్ చంద్రషా – కుసుమ్ బెన్ షా తల్లితండ్రులకు తేది 22-10-1964 లో జన్మించి వ్యాపార రీత్యా ముంబయి లో స్థిరపడినారు, అయినా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు పొందిన దైర్యశాలి, రాజకీయ శాణిక్యుడు,శత్రు దేశాలకు వణుకు పుట్టించే మగదీరుడు, మన దేశం లో నీ అనేక కీలక సమస్యలను పరిష్కరించిన అభినవా సర్దార్ వల్లభాయ్ పటేల్, దేశ అభివృద్ధి ప్రదాతకి ,ఇల్లంతకుంట మండల ప్రజల తరుపున అమితాషా కి 58 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూఅమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మన దేశ ప్రజలందరికి వారి సేవలు ఇలాగే ఇంకా అందాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తిని. స్వామి, మండల బీజేపీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!