అబద్దం… నిజమెప్పుడూ కాదు?

సేవా ముసుగు ఏదో ఒకనాడు తొలిగిపోక మానదు!

సబ్‌ రిజిస్ట్రార్‌పై ఆరోణలపై డిఆర్‌ స్పందించరా?

2017`18లో యూజర్‌ ఐడి క్రియేట్‌ చేయడం నిజం కాదా? 

ఈ సమయంలో ఎంక్వైరీ జరిగిందన్నది వాస్తవం కాదా?

ఆ మరునాడే యూజర్‌ ఐడి పునరుద్దురణ జరగలేదా?

ప్రైవేటు సైన్యం శాఖ పెద్దలక కనిపించడం లేదా?

ఒక ఉద్యోగి తమ కార్యాలయంలో ఇతర ఉద్యోగులను నమ్మకపోవడం ఏమిటి?

తోటి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? 

సబ్‌ రిజిస్ట్రార్‌ అవినీతి బైటకు పొక్కకుండా జాగ్రత్త పడడం కాదంటారా? 

జనంలో నుంచి వచ్చే ప్రశ్ననే మీడియా సందిస్తుంది?

ఉన్నత స్ధాయి యంత్రాంగమే నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సింది?

మీడియాపై చిందులేస్తే అబద్దం…నిజం కాదు..?

తప్పులు ఎత్తి చూపేందుకే మీడియా వున్నది!

సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బాధ్యులపై వున్నది!!

అది రిజిస్ట్రేషన్‌ కార్యాలయమా? లేక మాయా ప్రపంచమా…. ఇది జనం అనుకునే మాట….ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం. 2017`18లో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ తన పరిధిని దాటి, తనకు లేని అధికారంతో ఓ వ్యక్తికి కొలువు కుదర్చింది? కార్యాలయ పనిలో వ్యక్తిగత సహాయకుడిగా విధులు అప్పగించింది? ఓ ప్రైవేటు వ్యక్తి పేరు మీద యూజర్‌ ఐడి క్రియేట్‌ చేసింది? ఇది ఆ శాఖలో సంచలనం రేపిన సంఘటనగా ఉద్యోగులు చెప్పుకునే మాట. ఒక బాధ్యతాయుతమైన కుర్చీలో కూర్చున్నవారు చేయాల్సింది కాదు? అయినా ఓ కీలక బాధ్యతల్లో వున్న ఉద్యోగి, ఓ ప్రైవేటు వ్యక్తికి ఎలా ఐడి క్రియేట్‌ చేస్తారు? ఇది కార్యాలయంలో పెద్ద అలజడి. అదే కార్యాలయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే వుంటారు? ఒక వేళ బాధ్యతల నిర్వహణ కొన్ని సార్లు భారమవడం సహజం. అలాంటప్పుడు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ… పని బారం పంచుకోవడానికి ఇతర ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించొచ్చు. లేకుంటే ప్రభుత్వానికి తమకు మరింత మంది ఉద్యోగులు కావలని కోరొచ్చు. ఒక వేళ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియామకం చేసుకుంటే అందుకు తగ్గట్టు లెక్కాపత్రం వుండాలి? ప్రభుత్వ ఖజానానుంచి జీతమివ్వాలి… ఇదంతా చట్టబద్దంగా జరగాల్సిన తంతు…కాని 2017`18లో ఏం జరిగింది. ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ ఓ ప్రైవేటు వ్యక్తిని తన విధుల్లో సాయం కోసం విధులు అప్పగించడమే తప్పు! అతని పేరు మీద యూజర్‌ ఐడి క్రియేట్‌ చేయడం ఒక రకంగా చెప్పాలంటే నేరం. అలాంటి నియామకమే చట్టవిరుద్ధం… అదే సమయంలో ఆ కార్యాలయంలో ఎంక్వైరీ జరిగింది? ప్రైవేటు వ్యక్తికి యూజర్‌ ఐడి క్రియేట్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది? కాని ఆ సమస్య అక్కడితో తొక్కిపెట్టేశారు? అంటే పెద్దలు కూడా గద్దలైపోయినట్లే అన్న ఆరోపణలు ఆనాడే వినిపించాయి. ఇంతకీ ఆ ఎంక్వైరీ చేసిన అధికారులు ఎవరు? ఎంత మంది? ఈ యూజర్‌ ఐడి ఎందుకు దాచి పెట్టారు? దాచి పెడితే ఎవరి కోసం దాచిపెట్టారు? ఎంక్వైరీ అధికారులకు కూడా అమ్ముడుపోయారా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. అదే నిజమైతే పై అధికారులు ఎంక్వైరీ చేసిన వెళ్లిన రెండు రోజులకే యూజర్‌ ఐడి తిరిగి సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ పేరుమీదకు ఎలా మారింది? 2017`18 మధ్య కాలంలో ఆ కార్యాలయం నుంచి జారీ చేసిన సర్టిపికెట్లు ఏమిటన్నది…అవి ఎలా జారీ చెయబడ్డాయన్నదానిపై నిజా నిజాలు నిగ్గు తేలిస్తే అసలు విషయం ఏమిటో బైట పడుతుంది? ఇంతకీ ఆ సమయంలో సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ను వెనకేసుకొచ్చింది ఎవరు? కాపాడిరది ఎవరు? కాపాడాల్సిన అసవరం ఎందుకొచ్చింది? ఆనాడు ఎంక్వైరీ చేసిన వాళ్లు ఎవరు? ఎంక్వైరీ నిజాలు ఎందుకు బైటకు రాలేదు? జిల్లా రిజిస్ట్రార్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీటన్నింటికీ సమాధానం చెపాల్సిన బాధ్యత పై అధికారుల మీద లేదా? 

                             ఒక సబ్‌ రిజిస్ట్రార్‌కు విధుల్లో సాయం చేయడానికి పది మంది అవసరమౌతారా? రాష్ట్రం మొత్తం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇలాగే పది మంది ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారా? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి భూములు వ్యవహారం వెళ్లడం అన్నది సరైందేనా? ఇదే సబ్‌ రిజిస్ట్రార్‌ ఏ కాగితం లేకున్నా, ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి? వాటిని ఇప్పటికైనా శాఖ పెద్దలు నిగ్గు తేలుస్తారా? లేక తమకు వాటా వుందన్న విషయాన్ని అంగీకరించినట్లే అని మౌనం వహిస్తారా? మీడియాకు కావాల్సింది నిజా..నిజాలు…! మసిబూసి మారేడు కాయలు కాదు!! మాయామశ్చీంద్రులు అసలే కాదు…ఇప్పటికైనా జిల్లా పెద్దలు కదులుతారా? నిజా నిజాలు నిగ్గు తేలుస్తారా? ఒక వేళ సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఎలాంటి తప్పు చేయలేదని తేలితే సమాజానికి ఆదర్శమే కదా? 

                          తెల్లని వన్నీ పాలు కాదు..నల్లనివన్నీ నీళ్లు కాదని పెద్దలు ఏనాడో చెప్పారు. మాట్లాడే మాటలన్నీ నిజాలు కాదు…చెప్పే సుద్దులన్నీ నీతులు కావని తెలిసిందే…ప్రజా సేవ అన్నది ఒక పరమార్ధం. దాన్ని ప్రచారం కోసం, పరపతి కోసం పాకులాడడంలోనే డొల్ల తనం వుంది. దేశంలో చాలా మంది చాలా రకాలుగా తమ సేవాతత్పరతను చాటుకుంటుంటున్నారు. ఎడమచేతితో చేసే దానం కుడి చేతికి కూడా తెలియకుండా చేస్తున్నారు. కాని అరచేతిలో వైకుంఠం చూపరు. ప్రతి క్షణం ప్రచారం కోసం తాపత్రయపడరు…చేసేది తప్పని తెలుసు. కాని ప్రచారం లేనిదే ఓ క్షణం గడపలేరు. ఒక వ్యక్తి ఏక కాలంలో నాలుగు పనులు చేయలేరు. వృత్తి ధర్మంలో వున్నవారు ఆ పనిని దైవంగా భావించాలి. అంతే కాని పరోపకారం పేరుతో పనికి పాతర పెట్టి, ప్రచార ఆర్భాటంతో పది మందితో మెప్పుపొందాలనుకోవడం కూడా సరైంది కాదు. అయినా దూరపు కొండలు ఎప్పుడైనా నునుపే…సహజంగా ఎవరు చేసుకుంటున్న ప్రచారమైనా పది మందికి తెలిసినా, అది దూరంగా వుండేవారికి గొప్పగానే కనిపిస్తుంది. అసలు గుట్టేమిటో దగ్గరుండి చూసేవారికే తెలుస్తుంది. 

                            నిజాన్ని నమ్మేవారిని ఎవరూ నిలదీయలేరు. నిజాయితీ పరులను ఎవరూ నిందించరు. అవినీతి చేస్తున్నారని తెలిస్తే చాలు ఎవరైనా ప్రశ్నిస్తారు? ఆరాతీస్తారు? వెలుగులోకి తెస్తారు? అందులో మీడియా ముందుంటుంది. ప్రపంచం దృష్టికి తీసుకెళ్తారు. ప్రచారం గొప్పగా వున్నంత మాత్రాన అబద్దం నిజం కాదు…తప్పును తప్పనకుండా ఎవరూ వుండలేరు….తప్పన్నవారి నోర్లు మూయిస్తాను…వారిపై కేసులు పెట్టిస్తాను…అంటే ఎంత మంది నోరు మూయిస్తారు…ఎంత కాలం అబద్దాన్ని నమ్మిస్తారు…నిజం ఎప్పుడూ దాగేది కాదు..అబద్దం ఎల్లకాలం బతికేది కాదు…

                        పేరు పెద్దదే…అంటే చాలా పెద్దదని కాదు…! పది మందిలో మంచి పేరు సంపాదించుకోవడం అంటే ప్రచారం ఒక్కటే మార్గం కాదు…నిజమొక్కటే మార్గం…తప్పు ఎవరు చేసినా జనం గొంతులోనుంచి వచ్చే అనుమానాన్ని ప్రశ్నను చేసేదే మీడియా? ప్రపంచం ముందు ఒక చర్చను వుంచేదే మీడియా? మీడియా లేకుంటే ప్రపంచమే అల్లకల్లోలమౌతుంది? రాజరికమైనా, ప్రజాస్వామ్యమైనా ప్రపంచానికి నిజం తెలియాలంటే మీడియా ఒక్కటే మార్గం. ఆ మీడియా అన్నది సూర్యుడిలాంటిది. దాన్ని అరచేతిలో బంధించడం సాధ్యమయ్యేది కాదు…! 

                   ఒక్కరు చేసే పనికి పది మంది సైన్యమెందుకు? వారి సేవలెందుకు? వారితో కార్యాలయంలో విధులెందుకు? ఒక సాధారణ సబ్‌ రిజిస్ట్రార్‌ విధుల్లో సాయం కోసం పది మంది ప్రైవేటు వ్యక్తులు అవసరమా? వాళ్లెందుకు వున్నదీ? అన్నది జనమందరికీ తెలుసు. కార్యాలయంలో ఉద్యోగులకు కూడా తెలుసు. తన మాట వినని ఉద్యోగులను సరెండర్‌ చేస్తుంటే జిల్లా స్ధాయి అధికారులు ఏం చేస్తున్నారు? ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ను సమర్ధిస్తున్నారా? లేక వాటాలు పంచుకుంటున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఎవరు చెబుతారు???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!