*తాసిల్దార్ విజయ్ ప్రకాష్ రావు
*ఎస్ఐ రాజేష్
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిధిలో అనుమతి లేకుండా డీజే బాక్సులు పెట్టరాదు అని అలా పెట్టినచో చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని మండలంలోని డీజే సౌండ్స్ యజమానులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి ముందస్తుగా వారిని కొనరావుపేట మండల తాసిల్దార్ విజయ్ ప్రకాష్ రావు ముందు బైండోవర్ చేయనైనది ఇట్టి నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినచో యొక్క డీజే బాక్సులను సీజ్ చేసి కేసు నమోదు చేయబడును మరియు బైండోవర్ నిబంధనలను కూడా అమలుపరచబడును.