అది నేనేనంటూ ప్రచారమెందుకు 

  ` వాట్సాప్‌ గ్రూపుల్లో సానుభూతి కోసం పాకులాడుతున్నదెవరు?

  ` తప్పుడు ఆరోపణలంటూ ఉద్యోగుల మద్దతు కూడగడుతున్నదెవరు

  ` తనెవరో తనకు తెలిసిపోయిందా..?

  ` ఉమ్మడి జిల్లా పేరు చెప్పగానే, అసలు సంగతి తేలిపోయిందా?

 ` ఎవరికీ లేని ఉలుకు తనకెందుకే ఎందుకొచ్చింది 

 ` అంటే నేటిధాత్రి నిజాలు నావే అని ఒప్పుకున్నట్లు చెప్పకనే చెప్పినట్లేనా..?

 ` ప్రైవేటు వ్యక్తికి యూజర్‌ ఐడి ఇచ్చింది నిజమే అన్నట్లైంది

 ` ప్రైవేటు సైన్యం ఉందన్న విషయం ఒప్పుకున్నట్లైంది?

 ` అవార్డులు పని తనానికి గుర్తింపే గాని, నీతి నిజాయితీలకు రివార్డులు కావు

  ` ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న రోజే ఏసిబికి చిక్కిన ఉద్యోగులున్నారు

  ` ఈ మధ్య ఐదుసార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డు తీసుకున్న ఓ ఎమ్వార్వో మరుసటి రోజే పట్టుబడ్డారు

  ` అవినీతి ప్రజాసేవకు గీటురాయి కాదు

  ` ప్రజాసేవ చేసేవారికి ప్రైవేటు సైన్యం ఎందుకు..?

 ` ప్రభుత్వ కార్యాలయంలో వారితో పనులెందుకు..?

 ` తోటి ఉద్యోగులను నమ్మకపోవడమెందుకు..?

                       అవినీతిని అంతం చేస్తాం…గత డెబ్బై ఏళ్లుగా కేంద్రం నుంచి, రాష్ట్రం దాకా పాలించే పాలకులు చెబుతున్న మాట…తనకు అవకాశం వస్తే అవినీతి రహత సమాజం సృష్టిస్తా…ఇది సగటు వ్యక్తి చెప్పే మాట… ప్రతి పనికి రూపాయి తీసుకోకుండా పని చేయరు…నాకే ఆ ఉద్యోగం వుంటే బాగుండేది…చాలా మంది కొలువులు పొందక ముందు చెప్పిన మాట… అందరూ చెప్పేది అదే మాట…సమాజానికి అవినీతి రాచపుండులా మారిందనే మాట…అయినా ఎందుకు అవినీతి అంతం కావడం లేదు. పైగా అవినీతి చేస్తున్నవారిని గురించి చెప్పకూడదా? ఏ అధికారైనా అక్రమ సంపాదన సాగిస్తున్నాడని మాత్రం అనకూడదా? ఇదెక్కడి మాట…కష్టపడి చదువకొని ఉద్యోగం సంపాదించుకొని, నీతిగా, న్యాయంగా, ప్రజలు పైసా పైసా కష్టపడి సంపాదించామంటారు…ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ, ఇంకా అదే ప్రజలను నేరుగా పీడిస్తుంటే అడగొద్దా…అది తప్పని చెప్పొదా…పత్రికలు ప్రశ్నించొద్దా…సమాజం నిలదీయొద్దా…! మేం చేసే తప్పులు చేసుకుంటూ పోతాం…కాని మిమ్మల్ని వేలెత్తి చూపొద్దా? అమాయకులైన ప్రజల వద్ద సొమ్ము దాచిపెట్టుకున్నట్లు ఇంతిస్తేనే పని చేస్తా…అంటున్నా అడగొద్దా…! పని కోసం వచ్చిన ప్రజలను చీదరించుకుంటూ, చీవాట్లు పెడుతూ, పరుగులను చూసినట్లు చూస్తున్నా ఇదేమిటనొద్దా? వాళ్లిచ్చే సొమ్మును ముసిముసిగా లెక్కబెట్టుకుంటున్నా అడగొద్దా… ప్రజల కన్నీళ్ల కష్టం కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నా చూస్తూ ఊరుకోవాలా? 

                    సమాజంలో ఎంతో మంది ఉద్యోగులు పట్టుబడుతున్నా అవినీతి ఎందుకు అంతం కావడంలేదు. ఉద్యోగులు ఎందుకు భయపడడం లేదు…చట్టాలలో లొసుగులు కూడా చుట్టాలుగా మారుతున్నాయి…సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. తను కూడా కొన్ని సందర్భాలలో ఎదుర్కొన్న సమస్య అంటూ, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సమస్యలను ఏకరుపెట్టారు. అందుకే రిజిస్ట్రేషన్ల శాఖలో పెరిగిపోతున్న దుర్మార్గం మూలంగానే రెవిన్యూ యంత్రాంగానికి కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా వుంటే దేశంలో ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజమ్‌ తగ్గిపోతోందని సుప్రిం కోర్టు చీఫ్‌ జస్టిస్‌. రమణ వరంగల్‌లో చెప్పిన మాట. అంటే అవినీతి, అక్రమాలు, అక్రమార్జన, ప్రజలను వేధించుకుతినే వాళ్లను గురించి మీడియా ప్రపంచానికి తెలియజేయడం లేదన్నదే సిజేఐ చెప్పినమాట. మరి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ తన కార్యాలయంóలో సాగుతున్న దందా గురించి నేటిధాత్రి వరస కథనాలు అందిస్తోంది. వాటిని చూసి స్పందిస్తున్న ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆ విషయాలు నావే అంటూ…నేటిధాత్రి చెబుతుంది నన్నే అంటూ తోటి ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పంపిస్తోంది. అంటే జరిగినవి తన ఇలాఖాలో అన్నది గుర్తించినట్లేనా? ఆ కధనాలు నా గురించే అని ఒప్పుకున్నట్లేనా? మరే రిజిస్ట్రార్‌ ఎక్కడా స్పందించినట్లు లేదు. కాని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ ఎందుకు తోటి ఉద్యోగుల సపోర్టు కోసం పాకులాడుతున్నట్లు? పైగా తన కార్యాలయంలో తోటి ఉద్యోగులను నమ్మని ఆ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఇబ్బందులు ఎదురయ్యే సరికి తోటి ఉద్యోగుల అవసరం గుర్తుకు వచ్చిందా? ఇప్పుడు ఆ ప్రైవేటు సైన్యం ఉపయోగపడదా? పదేళ్ల కాలంలో కనీసం ఓ పది మంది తోటి ఉద్యోగుల రిమూవ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. వారిని కాదని ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఉద్యోగులను పురుగులను చూసినట్లు చూశారన్న విమర్శలున్నాయి. తన కింది ఉద్యోగులను నోటికొచ్చినట్లు తిడుతుందన్న విషయాలు కూడా అనేకం వున్నాయి. తోటి ఉద్యోగులకు యూజర్‌ ఐటి కాకుండా ప్రైవేటు వ్యక్తికి ఇచ్చారన్న నిజాలు కళ్లముందు కనిపిస్తున్నాయి…? 

                       అయినా ఇలాంటి సమయంలో తోటి ఉద్యోగులు సాయం కోరడ అంటే…ఇలాంటి పరిస్ధితి ఒకటి వస్తుందని ఎన్నడూ ఊహించకపోవడం కాదా? కష్టపడి ఉద్యోగం సంపాదించాను అని చెప్పుకుంటున్న సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ తన ఉద్యోగధర్మమే ప్రధమ కర్తవ్యం అన్నది గుర్తుందా? తాను విధినిర్వహణలో పది సార్లు ఉత్తమ అవార్డులు అందుకున్నానని కూడా చెప్పుకున్నారు. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్న రోజే ఏసిబికి చిక్కిన ఉద్యోగులను చూశాం! ఉత్తమ ఉద్యోగులుగా పలు సార్లు అవార్డులు తీసుకున్నవారిలో ఎంతో మంది అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. లంచావతారులుగా ప్రజల ముందు దోష/లుగా నిలబడ్డారు. అవార్డులు పని తనానికి కొలమానమేమో కాని, నీతికి కాదు…నిజాయితీ పొందిన సర్టిఫికెట్‌ కాదన్నది ..ముందు సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ తెలుసుకోవాలి. నీతి..నిజాయితీకి ప్రపంచంలోనే ఏ అవార్డులు లేవు. అవి ప్రజలు ఇవ్వాలి. ప్రజల మెప్పుతో సాధించాలి. పని కోసం వచ్చిన వాళ్లు గొప్ప అధికారిగా కీర్తించాలి. అంతే కాని తనకు ఇన్ని అవార్డులు , రివార్డులు వచ్చాయని చెప్పుకుంటే సరిపోదు…నీతులు చెప్పే వాళ్లంతా సర్వసంగ పరిత్యాగులు కాదని గతంలో అనేవారు. ఇప్పుడు ఆ పదం కూడా వాడలేకపోతున్నాం. ఎందుకుంటే స్వామి అంటే చాలు…అవినీతి అన్నది గుర్తు చేసుకుంటున్న రోజులివి. అలాంటిది ప్రజల పన్నులతో జీతం తీసుకునేవారు ప్రజలకు విధేయులుగా వుండాల్సిన ఉద్యోగులే పీక్కు తింటున్నారన్న వార్తలు వస్తుంటే కూడా వెలుగులోకి తీసుకురావొద్దా? మా కార్యాలయంలో ఏ పనికి రూపాయి చెల్లించాల్సిన అసవరం లేదు..అని అనేక ఎమ్మార్వో కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటుచేశారు. పోలీస్‌ స్టేషన్లలో కూడా ఈ బోర్డులు అనేకం వున్నాయి. ఏసిబి వాళ్లు పదే, పదే చెబుతున్నారు. మరి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్న సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇలాంటి బోర్డు వుందా? కనీసం ఏర్పాటు చేయాలన్న ఆచనైనా చేశారా? అదే నిజమైతే కార్యాలయంలో బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు? నిత్యం వందలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వస్తారు…అలాంటి వారి నుంచి రూపాయి ఎవరూ తీనుకోవద్దని ఉద్యోగులకు చెప్పారా? తన కార్యాలయంలో ప్రైవేటు సైన్యం లేదన్నది చెప్పగలరా? అవార్డులు అన్నవి మరింత ముందుకు వెళ్లేందుకు ప్రోత్సాహకాలే కాని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సెక్యూరిటీ కాదు..

                      ఓ వైపు జీతాలు సరిపోవడం లేదని ఉద్యోగులంతా అంటుంటే ఆ ఉద్యోగికి మాత్రం ప్రజాసేవ సేవ పేరుతో అందుతున్న సొమ్మెక్కడిది? కరోనా కాలంలో సోన్‌ సూద్‌ లాంటి వారు చేసిన సేవను అందరూ కొనియాడారు. కాని ఆ సొమ్ము ఎక్కడిదన్నది తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అతను ఓ ప్రైవేటు వ్యక్తి…ఇక తెలుగు రాష్ట్రాలలో చారిటీ పేరుతో కేఏ పాల్‌ లాంటి వారు కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాని చేసే సేవలకు, వచ్చే విరాళాలకు పొంతన లేదని ప్రభుత్వాలకు వాటికి అడ్డుకట్ట వేసింది. సేవ చేయడం గొప్ప దయా గుణం. మానవత్వం పరిమళించే దైవత్వం. కాదని ఎవరూ అనడం లేదు. ఎన్జీవో ఆర్గనైజేషన్‌ నిర్వహణ అన్నది సామాన్యమైనది కాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు… ఖర్చుతో కూడుకున్నది. రాజకీయ పార్టీలకు సైతం వచ్చే నిధులపై లెక్కలు చూపాలి. అలాంటిది ఒక సామాన్యమైన ఉద్యోగి, తన తాహతకు మించి సేవ చేస్తున్నాని ప్రచారం చేసుకుంటుంటే ప్రశ్నించరా? ఆ సొమ్మెక్కడిదని నిలదీయరా? దైవంగా భావించాల్సిన ఉద్యోగ కర్తవ్యాన్ని మర్చిపోతే అడగరా? పని దినాల్లో సేవల పేరుతో గైర్హాజరును ప్రశ్నించరా? కార్యాలయానికి వచ్చిన వారికి సేవలందకపోవడంతో చర్చించుకోరా? తన ఉద్యోగ జీవితంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పగలరా? ఎవరి వద్దా తాను రూపాయి తీసుకోలేదని చెప్పగలరా? తాను చేస్తున్న సేవకు అందుతున్న విరాళాల లెక్కలు బైట పెడతారా? ఏ ఒక్క తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయలేదని ప్రకటించగలరా? చేప నీళ్లలో వుంటూ తాగకుండా బతుకుతన్నా అంటే నమ్మగలమా? ఇది అంతే…నిరూపించుకోవాల్సిందిపోయి, నేటిధాత్రి మీద నిందలు వేయాలని చూస్తే, జనం నమ్మరు. సమాజంలో అవినీతి అంతానికి అడుగు పడాలన్నదే నేటిధాత్రి సంకల్పం. మొదలు పెట్టిన అక్షర యజ్ఞం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అవినీతి పరుడు కాదు. నీతులు చెప్పే వాళ్లంతా నిజాయితీ పరులు కాదు… సేవ చేస్తున్న వాళ్లంతా మహాత్ములు కాదు…నిజమైన సేవకు ప్రచారం అవసరం లేదు. అది సర్వత్రా వజ్రయేత్‌ అని పెద్దలు అందుకే అన్నారు. ప్రచారం ముందు సంతోషాన్నిస్తుంది. తర్వాతే కష్టాల్లోకి నెట్టేస్తుంది. తన జీతంలో ఎంత వాడుకుంటూ, ఎంత సేవకు వినియోగిస్తున్నట్లో ఒక్క లెక్క చెబితే సరిపోతుంది. చేస్తున్నది సేవనా…ప్రచారమా? అక్రమాలకు సేవా ముసుగా? అన్నది…సింపుల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!