పలు అంశాలమీద చర్చ, దసరా పండగ ఏర్పాట్లు,పందుల కుక్కల బెండద కై చెర్యలు
పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల పట్టణంలో సోదా అనిత రామకృష్ణ చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ అత్యవసర సర్వ సభ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తేదీ 09 అక్టోబర్ 2023 రోజున మున్సిపల్ భవనం పురపాలక మంత్రివర్యులు కేటీఆర్చే ప్రారంభించబడుచున్నందున ఆ ఏర్పాట్ల గురించి మరియు దసరా పండుగ ఏర్పాట్లు గురించి రేపటి నుంచి పాఠశాలలో ప్రారంభమయ్యే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అంశాలన్నింటినీ సభ్యులందరూ ఆమోదించడం జరిగింది.పట్టణంలో కోతులు, పందులు,కుక్కల బెడద ఎక్కువగా ఉండటం వలన నివారణ చర్యలు తీసుకోవడానికి పాలకవర్గ సభ్యులు నిర్ణయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ టి. శేషు,వైస్ చైర్మన్ రేగురి విజయ పాల్ రెడ్డి,కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, ఒంటేరు సారయ్య, పొరండ్ల సంతోష్,గొర్రె స్రవంతి రాజు, దామెర మొగిలి,అడపా రాము,బెజ్జంక్కి పూర్ణ చారి, పసుల లావణ్య రమేష్,బండి రాణి సదానందం గౌడ్, శనిగరపు రజిని నవీన్,మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్, చందుపట్ల సుజాత సాయి తిరుపతి రెడ్డి,ఎకు రాజు,పంచగిరి జయమ్మ,అర్ జయంత్ లాల్,పాల్గొన్నారు.