అటవీ సంరక్షణ సవరణ రద్దుకై ఐక్యంగా పోరాడాలి

నర్సంపేట,నేటిధాత్రి :

2023 అటవీ సంరక్షణ సవరణ చట్టం రద్దుకై ఐక్యంగా పోరాడాలని తెలంగాణ రైతు కూలి సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి పిలుపునిచ్చారు.ఈ నెల 12,13 తేదీలలో ఏఐకేఎంకేఎస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగు జాతీయ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రైతు కూలి సంఘం వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని సంఘం కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జరిగినది. ఈ సందర్భంగా ఈర్లపైడి మాట్లాడుతూ దేశ పరియావరణాన్ని ప్రభావితం చేసి ఆదివాసి హక్కులను, జీవితాలను హరించే రెండు బిల్లులను 2023 జూలై 26న లోకసభ ఆమోదించింది. 1980 అటవీ సంరక్షణ చట్టానికి చేసిన సవరణ చట్టం ఒకటైతే, జీవవైవిద్య సవరణ చట్టం రెండవది అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసి తెగలను అణిచివేసి, అక్కడి ఖనిజాలు, సంపదలను లూటీ చేయడానికి, ప్రకృతి వనరులను నాశనం చేసి, దేశ పర్యావరణాన్ని దెబ్బతీసేందుకు చట్టాలను చేశారని ఆరోపించారు. ఇందుకోసం విశాఖపట్నంలో అఖిలభారత కేత్ మజ్దూర్ కిసాన్ సభ (ఏఐకేఎంకేఎస్) ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సుకు ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈ రెల్లి రామచందర్,భూమా అశోక్, బర్ల గౌరయ్య, శివరాత్రి కుమార్, భాష బోయిన అనిత, బోనగిరి సారయ్య, అజ్మీర పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *