అజరా… కచరా పని!?

`హెల్త్‌ స్కీమ్‌ పేషెంట్లు టార్గెట్‌…

`లబోదిబోమంటున్న బాధితులు

`వైద్యం చేత కాకున్నా చేర్చుకుంటారు…

`నాలుగు రోజులు హడావుడి చెస్తారు!

`ఐదో రోజు చేతులెత్తేస్తారు!

`ఈ లోపు హెల్త్‌ కార్డ్‌ ఖాళీ చేస్తారు.

` హైదరాబాదు తీసుకెళ్లమని ఉచిత సలహా ఇచ్చేస్తారు!

`తాజాగా ఘటనతో వెలుగులోకి వచ్చిన అజర యవ్వారం…

`వైద్యాన్ని వ్యాపారం చేసి సాగిస్తున్న మోసం.

`పరకాల కు చెందిన ఓ. ప్రభాకర్‌ ఇటీవల అజరాలో చేర్చుకున్నారు.

` హైదరాబాదు వెళ్ళినా ఇదే వైద్యం అని మాయమాటలు చెప్పారు?

`హెల్త్‌ కార్డ్‌ ఖాళీ చేశారు…

`వైద్యానికి శరీరం సహకరించడం లేదని వదిలించుకున్నారు.

`నడుచుకుంటూ అజరలో చేరిన ప్రభాకర్‌ కుర్చీకి పరిమితమయ్యాడు.

`ప్రస్తుతం హైదరాబాదు యశోదలో చికిత్స తీసుకుంటున్నాడు.

`చేతి నుంచి మళ్లీ డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నాడు.

` ప్రైవేటు ఆసుపత్రుల నయా మోసం…

`ఆరోగ్య భరోసా కోసం హెల్త్‌ స్కీములు ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయం.

`ప్రజల జీవితాలతో చెలగాటం.

`ఇలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోకుంటే, ఇతర 

 ఆసుపత్రులు ఇదే చేసే ప్రమాదం వుంది.

`ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. 

`పైన పటారం, లోన లొటారం ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి. 

`అజర మీద కేసులు నమోదు చేయాలని బాధితుల డిమాండ్‌. 

`అజరాలో చేరితే బేజారే!

`అక్కడ వైద్యం బేకారే!!

`హెల్త్‌ కేర్‌, రిసెర్చ్‌ సెంటర్‌ పేరిట అజరా అరాచకం!

`ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లా నిర్మాణం…

`హంగులూ ఆర్భాటాలతో మోసం…

`వైద్యలు కాదు, యమకింకరులు బాధితుల శాపనార్థాలు.

మనిషి ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రులు వైద్యం గాలికొదిలేస్తున్నాయి. సంపాదన మీద దృష్టి పెడుతున్నాయి. రోగులను ఆకర్షించేందుకు అద్దాల మేడలు చూపిస్తున్నారు. వైద్యానికి అవసరమైన వ్యవస్థలు మర్చిపోతున్నారు. పేరుకు వైద్యల లిస్ట్‌ చాంతాడంత చూపిస్తున్నారు. స్పెషల్‌ బిల్లులలో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. వైద్యానికి అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లు లేకున్నా, వైద్యం అంటూ ఊదరగొడుతున్నారు. రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టాలలో వున్న లొసుగులను ఆసరా చేసుకొని వైద్యాన్ని వ్యాపారం చేసుకొని, కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. హన్మకొండ లోని అజరా ఆసుపత్రి లో తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వైద్య రంగానికే మాయని మచ్చను మిగిల్చింది. 

హెల్త్‌ స్కీమ్‌ పేషెంట్లు టార్గెట్‌…

అడుక్కున్నోడికి అరవై కూరలు అన్నట్లు, అతి తెలివి తేటలు మించిపోతున్నాయి. డాక్టర్లు కొందరు రింగుగా ఏర్పడడం…నగరాలలో నాలుగు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తలా ఇంత పెట్టుబడి పెట్టి, ఆసుపత్రుల నిర్మాణాలు సాగిస్తున్నారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను తలపించేలా హంగులూ ఆర్భాటాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. తమ ఆరోగ్యాల కోసం అవసరమొస్తుందని ఇటీవల కాలంలో చాలా మంది హెల్త్‌ స్కీమ్‌ లలో చేరుతున్నారు. పాలసీలు తీసుకుంటున్నారు. బతకనేర్చినోడికి అరవై దారులన్నట్లు, ప్రైవేట్‌ ఆసుపత్రులు కొత్త దారులు ఎంచుకున్నారు. కరోనా ప్రభావం మూలంగా ఆర్థిక పరిస్థితి ఎలా వుంటుందో అన్న భయంతో పేదలు తీసుకుంటున్న హెల్త్‌ స్కీములు ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారాయి. ఇలా హెల్త్‌ స్కీమ్‌ పాలసీ వుందన్న సమాచారం తెలుసుకొని, పకడ్బందీ ప్లాన్‌ చేస్తున్నారు. వైద్యం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. బాధితులు లబోదిబో మంటున్నారు. 

ఇంతకీ ఏం జరిగింది:

 ఇటీవల పరకాల పట్టణానికి చెందిన ఓ. ప్రభాకర్‌ అనే వ్యక్తి నరాల సంబంధిత వ్యాధి చికిత్స కోసం న్యూరో ఫిజీషియన్‌ వినయ్‌ కుమార్‌ ను కలిశాడు. అతని వివరాలన్నీ తెలుసుకున్న ఆ వైద్యుడు అజరా ఆసుపత్రిలో చేరమని సూచన చేశాడు. ఆ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు వున్నాయని నమ్మించాడు. తానే స్వయంగా వచ్చి వైద్యం చేస్తానన్నాడు. దాంతో ప్రభాకర్‌ అజరాలో చేరాడు. నాలుగు రోజుల పాటు అజరాలో వైద్యం చేసినట్లు హడావుడి చేశారు. బిల్లులు వేశారు. హెల్త్‌ కార్డును గీకేశారు. తర్వాత మా వల్ల కావడం లేదని చేతులెత్తేశారు. మా వల్ల కావడం లేదని చెప్పడం కూడా తమ గొప్పతనం అన్నట్లుగా, మంచి వైద్యం అందాలన్న సలహా ఇస్తున్నామని హితవు వచనాలు కూడా చెప్పారు. అంతకు ముందు ప్రభాకర్‌ కుటుంబానికి ఇచ్చిన హామీ మర్చిపోయారు.

వైద్యం కోసం ప్రభాకర్‌ తొలుత కలిసిన డాక్టర్‌.వినయ్‌ కుమార్‌ తాను ఉస్మానియా లో చదివిన డాక్టర్‌ నే. 

హైదరాబాదు లోని ఆసుపత్రులలో చేసే వైద్యమే నేనూ చేస్తాను. అనవసరంగా హైదరాబాదు వెళ్లడం ఎందుకు అని సలహా కూడా ఇచ్చాడు. నన్ను నమ్మండి. అని భరోసా కూడా ఇచ్చాడు. నాలుగు రోజుల తర్వాత చేతులెత్తేశాడు. వైద్యం చేత కాకున్నా చేర్చుకుంటారు…ఇదీ బాధితులు అంటున్న మాట. అజరా పై శాపనార్థాలు పెడుతున్న మాట. అసలు వైద్యం చేతకానప్పుడు ఆసుపత్రులు ఏర్పాటు చేయడం దేనికి? వైద్యులన్న సోయి మర్చిపోయి ప్రజలను పీక్కుతినడం దేనికి? నాలుగు రోజులు హడావుడి చెస్తారు! ఐదో రోజు చేతులెత్తేస్తారు! చాలా బాధితులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పేరు పెద్దది. వ్యాపారం గొప్పది. వైద్యం ఉత్తుత్తిది అన్నట్లుంది.

హెల్త్‌ కార్డుల మీద వ్యాపారం గత కొంత కాలంగా సాగిస్తున్న అజరా ఆసుపత్రి వెనుక పెద్ద వ్యవహారం దాగి వుంది.

 పెద్ద ఎత్తున కొంత మంది డాక్టర్లు సిండికేట్‌ గా మారి అజరా ఏర్పాటు చేశారు. దాదాపు 80 కి పైగా డాక్టర్లు అందుబాటులో వున్నట్లు పెద్ద పెద్ద బోర్డులు ఎర్పాటు చేశారు. కానీ వాళ్లెవరూ ఎల్లప్పుడూ అందుబాటులో వుండరు. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వస్తారు. తలా పది పైసలు వేసుకొని అజరా లో రింగైన డాక్టర్లుకు ప్రత్యేక క్లినిక్‌ లు వున్నాయి. ఇతర ప్రైవేటు ఆసుపత్రులలో భాగస్వామ్యం వుంది. ఇంత మంది డాక్టర్లు వైద్యం చేయడం కన్నా, లెక్కలు, లాభాల వాటాలు చూసుకోవడం కోసమే వున్నారు? అనేది సర్వత్రా వినిపించే మాట. 

 తాజాగా ఘటనతో మరోసారి అజర యవ్వారం వెలుగులోకి వచ్చింది.

 మాయమాటలు చెప్పి, మెరుగైన వైద్యం చేస్తామని నమ్మించి నట్టెట ముంచారు. వైద్యానికి శరీరం సహకరించడం లేదని వదిలించుకున్నారు. నడుచుకుంటూ అజరలో చేరిన ప్రభాకర్‌ కుర్చీకి పరిమితమయ్యాడు. ప్రస్తుతం హైదరాబాదు యశోదలో చికిత్స తీసుకుంటున్నాడు. చేతి నుంచి మళ్లీ డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నాడు. ప్రైవేటు ఆసుపత్రుల నయా మోసం…ఆరోగ్య భరోసా కోసం హెల్త్‌ స్కీములు ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయం. ప్రజల జీవితాలతో చెలగాటం.

ఇలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోకుంటే, ఇతర ఆసుపత్రులు ఇదే చేసే ప్రమాదం వుంది. 

అందువల్ల పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం నిరంతర నిఘా పెట్టాల్సిన అవసరం వుంది. లేకుంటే ఎంతో మంది అమాయకుల జీవితాలు బలి అవుతాయి. అజరాలో చేరిన ప్రభాకర్‌ చెందిన హెల్త్‌ కార్డ్‌ డబ్బులు లాగేశారు. తర్వాత ఆయన సికింద్రాబాద్‌ లోని యశోద లో జాయిన్‌ అయ్యాడు. కానీ సొంతం డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారకులు అజరా ఆసుపత్రి యాజమాన్యం. ఎంతో ముందు చూపుతో హెల్త్‌ కేర్‌ కోసం ఇన్సూరెన్స్‌ చేయించుకుంటే ఏం లాభం. ఆసుపత్రి దాహానికి ఊడ్చుకుపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఏఏ ఆసుపత్రులలో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్న వాటిని గుర్తించి వెంటనే వాటి పర్మిషన్‌ రద్దు చేయాలి. ఆ డాక్టర్ల సర్టిఫికెట్లు రద్దు చేయాలి. అప్పుడు గాని డాక్టర్లు కు భయం వుండదు. పైన పటారం, లోన లొటారం ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి. అజర మీద కేసులు నమోదు చేయాలని బాధితుల డిమాండ్‌. అజరాలో చేరితే బేజారే!అక్కడ వైద్యం బేకారే!!హెల్త్‌ కేర్‌, రిసెర్చ్‌ సెంటర్‌ పేరిట అజరా అరాచకం! ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లా నిర్మాణం చేశారు. హంగులూ ఆర్భాటాలతో మోసం చేస్తున్నారు. 

వైద్యలు కాదు, యమకింకరులు బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!