ఖమ్మం, ఏప్రిల్, 6:
తెలంగాణ రాష్ట్ర స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విన్నకోట అజయ్ కుమార్ భౌతిక కాయానికి పలువురు రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల ప్రముఖులు అంజలి ఘటించారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉంచిన పార్థీవ దేహాన్ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్,
ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, గ్రానైట్ అసోసియేషన్ ప్రముఖులు, కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు అజయ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారంతా దు:ఖంలో ఉన్న అజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. జుబ్లీ హిల్స్ మహాప్రస్థానం లో అజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు వెంకట్ వరుణ్ తండ్రికి తల కొరివి పెట్టారు. కార్యక్రమంలో అజయ్ వియ్యంకుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.