వేములవాడ:ప్రతినిధి నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం నవ తెలంగాణ సీనియర్ రిపోర్టర్ వినోద్ అన్నకు టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వినోద్ అన్న ఆయన కథనాలతో విశేషమైన ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. వార్తల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న అన్న వివరించి చెప్పేవాడు, అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు.. టీయూడబ్ల్యూజేహెచ్143 పక్షాన వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని పెద్దదిగా ఉండి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆయన వార్త కథనాలు తోటి జర్నలిస్టులకు స్ఫూర్తి. వినోదన్న కలం యోధుడని కొనియాడారు .ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి పాశం, మహమ్మద్ రఫీ, సయ్యద్ అలీ ,ఒడియాల వేణు, సిహెచ్ దేవరాజ్, దూస రాజేందర్, ఎస్ వేణు, సంటి రాజేందర్, బండి రజనీకాంత్, సాయి, బండి శ్రీకాంత్, అసీం, వెంకటేష్, షబ్బీర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.