`బలమైన నాయకుడు కేసిఆర్ అడుగుజాడలే…
`అన్ని పార్టీలలో ఆమోదమే..
`ఈసారి బడుగులకు బిఆర్‌ఎస్ లో అత్యంత ప్రాధాన్యత.
`సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట.
`అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క.
`బిఆర్‌ఎస్ అంటే బడుగులకు అండ సంకేతాలు.
`అదే బాటలో బిజేపి పయనం.
`ఈటెల ఎంపికలో అదే పరమార్ధం.
`కాంగ్రెస్ లో కూడా మొదలైన బడుగుల జపం.
`పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ తో ఒక్కసారిగా కలకలం.
`కాంగ్రెస్ ను ఇంత కాలం కాపాడిరది బడుగు నేతలే.
`కాంగ్రెస్ కు ఎల్లకాలం ఓటు బ్యాంకు బడుగులే.
`అందరూ ఇప్పుడు బడుగుల నినాదమే.
`పటించేది బడుగుల మంత్రమా!
పార్టీల కొంగ జపమా!?
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాల్లో ఏ విషయం గమనించినా అందులో ముఖ్యమంత్రి కేసిఆర్ ముద్రనే స్పష్టంగా కనిపిస్తుందే తప్ప, ప్రతిపక్షాల ఆలోచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలను కేసిఆర్ వేలు పట్టుకొని నడిపిస్తున్నాడా? లేక ప్రతిపక్షాలే కేసిఆర్ వేలు పుట్టుకొని నడుస్తున్నాయో? అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలు విమర్శించే ప్రతిపక్ష కాంగ్రెస్,బిజేపిలు అవే పధకాలకు మరింత ఆర్ధికమద్ది ప్రచారాస్త్రాలు చేసుకుంటున్నాయి. దానికి తోడు ప్రతి క్షణం ముఖ్యమంత్రి కేసిఆర్ వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తూ, వాటినే అనుసరించడం కూడా ప్రతిపక్షాలు అలవాటు చేసుకుంటున్నాయి. తాజాగా బిఆర్‌ఎస్ ఈసారి వచ్చే ఎన్నికల్లో బడుగులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పసిగట్టాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలనీ బడుగుల ఆర్ధిక స్వేచ్ఛ ,స్వాలంబన మిలితమై వుంటున్నాయి. అందులో భాగంగానే వేసే ప్రతి అడుగు పేదలైన బడుగులు సంక్షేమం కోసం చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఆది నుంచి అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు కూడా పేదలైన బడుగుల జీవితాల్లో వెలుగుల నింపేందుకు, వారి జీవితాలకు భరోసా కల్పించేందుకు ఎంతో ఉపయోపడుతున్నాయి. అయితే ఆసరా అన్నది కేవలం పేదరికమే ప్రాతిపదికగా అమలు చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి , షాదీ ముబాకర్ లాంటవి కూడ అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. అయినా బగుడుల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయా వర్గాలు అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా సమానత్వాన్ని సాధించాలి. ఇది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన. అందుకే తెలంగాణలో దళిత బంధు అనే పధకం ప్రారంభించారు. నిజానికి ఇది గొప్ప పధకం. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి పథకం అమలు జరగలేదు. ప్రపంచానికి సమానత్వ పాఠాన్ని చెప్పిన ప్రాన్స్‌లో కూడా ఇలాంటి గొప్ప పధకాలు ఏనాడు లేదు. ఎందుకంటే ప్రపంచ గతినే మర్చిన ప్రాన్స్ విప్లవం ఒక గొప్ప మలుపు. ఒక్క రొట్టె ముక్క కోసం వచ్చిన విప్లవం ప్రాన్స్ విప్లవం. ఆకలి కోపం ఎలా వుంటుందో పాలకులకు రుచి చూపించిన విప్లవం ప్రాన్స్ విప్లవం. అలాంటి దేశంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వ్రుం వున్నప్పటికీ పేదల సంక్షేమం, ఆర్ధిక స్వావలంబన కోసం ఏనాడు కృషి చేసింది లేదు. ఆకలి, ఆర్ధిక, సామాజిక అసమానత్వాలు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. అందుకు ప్రాన్స్ విప్లవం ఒక ఉదాహరణ. బాస్టిలీ జైలు ఉదంతం ఒక నిర్ధారణ. అయినా ప్రాన్స్‌లో సహజంగా వచ్చిన మార్పులోనే అన్ని వర్గాలు అక్కడ ఎదిగాయి. కాని మొదటిసారి ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమం అన్న పదానికి కొత్త అర్ధం చెప్పారు. దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది దళితుల కుటుంబ జీవితాల్లో వెలుగులొచ్చాయి. తెలంగాణలోని మొత్తం దళిత సమాజాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం వారి జీవితాలను దీర్చిదిద్దుతున్నారు. దశల వారిగా దళిత బంధు విడుదల చేస్తూ వారికి ఆర్దిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆ తర్వాత గిరిజన బంధు ప్రకటించారు. అంతకు ముందే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. తాజాగా వాటిని కూడ గిరిజనులకు అందజేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పోడు భూముల సమస్యల ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా పరిష్కారం కాలేదు. అలా గిరిజనుల జీవితాలను కూడా పండగ చేస్తున్నారు. ఈ మధ్య బిసిలకు లక్ష సాయం పథకం ప్రకటించారు. త్వరలో అది కూడా అమలు కానున్నది. ఇలా బిడుగుల కోసం ఒక్కొక్కటీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. సమాజంలో అసమానతలు రూపు మాపే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రజలకు వచ్చేఎన్నికల్లో ఏం చెప్పాలో తోయడం లేదు. దళిత బంధును పెంచి ప్రకటిస్తామా? అంటే అది బిఆర్‌ఎస్ పార్టీని కాపీ కొట్టినట్లే అవుతుంది. ఏ పధకం ప్రకటించాలన్నా వాటికి పేటెంట్ రైట్లు బిఆర్‌ఎస్ వే అన్న భావన కల్గుతోంది. తాజాగా ఆయా పార్టీలు రాజకీయాల్లో బడుగులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచన చేయకముందే ముఖ్యమంత్రి కేసిఆర్ ఈసారి ఎన్నికల్లో బడుగు నేతలుకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తేఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నాడని తెలిసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా బిడుగుల జపం చేస్తున్నట్లే కనిపిస్తోంది.
బిజేపి తీసుకున్న తాజాగా నిర్ణయాల్లో కూడా బడుగుల వైపు బిజేపి కూడా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే పైకి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసినా, ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి మెరుగైన ఫలితాలు లభించే అవకాశాలున్నాయన్న అంచనాకు బిజేపి పెద్దలొచ్చారు. అందుకే కర్నాటక ఎన్నికల తర్వాత బిజేపి సినారియా మారింది. గత కొంత కాలంగా అటూ, ఇటూ డైలమా కొనసాగించినా, తెలంగాణలో బిజేపి బతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా బడుగుల కార్డు వినియోగించుకుంటే తప్ప మనుగడ సాగించలేమన్నది గుర్తించింది. నిజానికి తెలంగాణలో కూడా బడుగుల నేత సంజయ్ నేతృత్వంలోనే పార్టీకి ఊపు వచ్చింది. కాని ఆయన దూకుడే పార్టీని కొంప ముంచేలా వుందన్న తేలిపోయింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ ఖాళీ అయ్యే పరిస్ధితికి వచ్చింది. అధికార బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే బండి సంజయ్ బలం సరిపోదు. ఆయన వుంటే పార్టీ నేతలు కూడా సహకరించే పరిస్ధితి కనిపించడం లేదన్నది తెలిపోయింది. బిజేపిలోఒక్కసారిగా పెరిగిన అరువు నేతలే, పార్టీని ముంచడమా? తేల్చడమా? అన్నదాకా రావడంలో వారిని కాపాడుకోవాల్సిన అవసరం బిజేపికి కల్గింది. దాంతో బిజేపి కూడా బిసి జపం చేయాల్సి వస్తోంది. ఎందుకుంటే బిఆర్‌ఎస్ మీద ప్రతిపక్షాలు ఓ ముద్ర వేశాయి. కాంగ్రెస్ మీద మరో ముద్ర వుండనేవుంది. దాంతో బిఆర్‌ఎస్ అన్నది ఇటీవల బడుగుల పార్టీ ప్రజలు అక్కున చేర్చుకునేందుకు అనేక పధకాలు అమలు కూడా చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయమే…దాన్ని కూడా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక మిగిలింది కాంగ్రెస్సే…మేమేం తక్కువ..మాకేం తక్కువ. మాకు వున్న ఓటు బ్యాంకు బలమే బడుగులు అన్నది తెరమీదకు తెచ్చేందుకు కాంగ్రెస్ కూడా కొత్తఎత్తులకు సిద్దపడుతోంది.
కాంగ్రెస్‌లో మాత్రం ఒక తరహా తిరుగుబాటు కూడా మొదలైనట్లే కనిపిస్తోంది.
మాజీ పిసిసి. అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తాజగా విడుదల చేసిన బిసి నేతల జాబితాతో కాంగ్రెస్‌లో ఒక కల్లోలం మొదలైనట్లే లెక్క. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓట్లు బడుగులవి..సీట్లు రెడ్లవి అన్న నానుడి వుండేది. వారి పెత్తనమే ఎప్పుడూ సాగేది. అటు ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ వచ్చినా అదే దోరణ కనిపిస్తోంది. మొదటి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించినా, ఆ తర్వాత ఇద్దరూ రెడ్డి నేతలను పిసిసిలుగా నియమించారు. నేను పిసిసి అధ్యక్షుడినౌతా అంటూ విహెచ్. హనుమంతరావు , దామోదర రాజనర్సింహా లాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా చేసేవారు లేరు. వారి గోడు వినేవారు లేరు. కాని జగ్గారెడ్డి, కోమటి రెడ్డి లాంటి వారి వార్తలు మాత్రం చక్కర్లు కొడతాయి. ఇదీ కాంగ్రెస్ తీరు. మరి ఈసారైనా జెండా ఎగరేయాలంటే అదే మూస కాంగ్రెస్ వెళ్తుందో..లేక బడుగుల జపం చేస్తుందో చూడాలి.