అందరి ఆశీస్సులతో ఈ గౌరవం

అందరి ఆశీస్సులతో ఈ గౌరవం -రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు

సమాజంలో సాయం అవసరమైన వారికి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో ఏ ఒక్కరూ న్యాయపరమైన సేవలకు దూరం కావొద్దని రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు అన్నారు.

 

ఇటీవల ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయిన సందర్భంగా ఆయనకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

రాబోయే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ శాతం కేసులు పరిష్కరించాలన్నారు. తాను భద్రాద్రి జిల్లా, జూలూరుపాడు మండలం, గుండెపూడి అనే ఓ మారుమూల గ్రామంలో పుట్టానని, యల్లంకి పుల్లారావు అనే చిన్ననాటి స్నేహితునితో ఒకటో తరగతి నుంచి కొత్తగూడెంలో కోర్టులో న్యాయవాది వృత్తి వరకు స్నేహం కొనసాగించటం చాలా పెద్ద విషయమని, గత సెప్టెంబర్ లో.. మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. 

 

ఈ ఆత్మీయ సత్కారంలో రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి పట్టాభి రామారావు, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కళ్యాణ్, కార్యదర్శి దేవేందర్, పోట్ల జయసింహ, రావులపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు 

జైపాల్ రెడ్డి, బలరాం చౌదరి, యల్లంకి పుల్లారావు, రేపాకుల నాగేశ్వరరావు, జి‌.రవి చంద్రశేఖర్, కొండపల్లి శ్యాం, వినోద్ కేతేపల్లి, సితారామారెడ్డి, శేషగిరిరావు, నాంచర్ల మురళీ, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఖమ్మం , హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయ సంబంధమైన వారు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *