మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని నర్సింగ్ తాండ గ్రామ పంచాయతీలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన దేపల్లి సత్తయ్య(43) అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ విషయన్ని బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి సంతాపం తెలిపి, మృతుడి అంత్యక్రియల ఖర్చుల కోసం బాధిత కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మొగిలి మహిపాల్, వార్డ్ సభ్యులు లక్ష్మయ్య, యాదయ్య, చెన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు కొమ్ము చెన్నయ్య, జంగయ్య, అంజయ్య, చెన్నయ్య, నర్సిములు, యాదయ్య, బి, ఆర్, ఎస్, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు