
నర్సంపేట,నేటిధాత్రి :
రాబోయే ఎన్నికల దృశ్య అంగన్వాడి టీచర్లకు బూత్ లెవెల్ అధికారులుగా డ్యూటీలు వేయొద్దని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బీఅర్టియు ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలో నర్సంపేట ఆర్డీవో కృషవేణి,ఎమ్మార్వో విశ్వప్రసాద్ లని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ఐసిడిఎస్ లో అంగన్వాడి కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా నిర్వహిస్తున్నామని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఈ నేపధ్యంలో బీఎల్ఓ డ్యూటీలలో మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం POSHAN పోషన్ ట్రాకర్, ఎన్ హెచ్ టిఎస్ ఈ రెండు యాప్ లలో సర్వీస్ ను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడం, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య లక్ష్మి సేవలు, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ లతో పాటు శాఖాపరంగా ఇచ్చే కార్యక్రమాలన్నీ చేయాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు వయసు పైబడిన వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సమస్యలను అర్థం చేసుకొని మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. నాయకులు పాలడుగు రమేష్, నర్సంపేట ప్రాజెక్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొర్రె రాధ, బత్తిని శిరీష, మండల ప్రధాన కార్యదర్శి D. రమాదేవి, మండల నాయకులు సుగుణ,ధనలక్ష్మి,జ్యోతి,ఎస్తేర్, కవిత, సుశీల నర్సంపేట మండలంలోని అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.