సిఐటియు జిల్లా
కార్యదర్శి కుంట ఉపేందర్
మరిపెడ నేటి ధాత్రి
అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.మంగళవారం మరిపెడ పట్టణ కేంద్రంలో రెండో రోజు తెలంగాణ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవర్థిక సమ్మె కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 48 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వాలు వారిని నేటిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం సిగ్గుసేట అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని. కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల చర్చ జరపాలని డిమాండ్ చేశారు. లేనియెడల అంగన్వాడిల సమ్మెను ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ, సిఐటియు నాయకులు దుండి వీరన్న, నందిపాటి వెంకన్న, కొండ ఉప్పలయ్య,మండల అధ్యక్షురాలు మంద పుష్ప, ప్రధాన కార్యదర్శి కుమ్మరి కుంట్ల జ్యోతి, నాయకురాలు అనబత్తుల రేణుక, గుమ్మడి కళమ్మ, సింతోజ్ లక్ష్మి, ముదిరెడ్డి శ్రీలత, తదితరులు ఉన్నారు.