హస్తానికి రేవంత్‌ బైబై!?

-కాంగ్రెస్‌ లో కరివేపాకు కాకముందే నిర్ణయం!

-కాంగ్రెస్‌ లో పెట్టిన కరంటు మంటలే అందుకు కారణం!

-కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ జంప్‌!?

-సొంత గూటికి రేవంత్‌!?

-టిడిపి, బిజేపి పొత్తులో భాగమే!

– రేపో మాపో టిడిపి గూటికి..?

-18 మందితో బైటకి!

-షర్మిల ప్రస్తావనే రేవంత్‌ కు ఇష్టం లేదు?

– రేవంత్‌ వద్దన్నా ఆగే పరిస్థితి కనిపించడం లేదు?

-ఎవరి కోసమో కష్టపడడం వృధా?

-కాంగ్రెస్‌ లో వున్న రేవంత్‌ వర్గమంతా హాండిచ్చేందుకు రెడీ!

-కాంగ్రెస్‌ ను వదిలేయడం ఖాయం!

– అమెరికా లో అన్ని విషయాలపై సమాలోచన.

-అటు ఉద్యమకారులు, ఇటు పూర్వ టిడిపి నాయకులు!

– కాంగ్రెస్‌ కు ఎంత సేవ చూసినా వృధానే?

-ఈ కష్టమేదో టిడిపి లో పడితే లాభమే!

-అక్కడ ఎదురులేని స్థానమే!

– ఇప్పటికీ టిడిపి ఎంతో కొంత ఉనికిలో వున్నదే?

– హైదరాబాద్‌, రంగారెడ్డి సీట్లు వశమే!

-ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ లలో పాగా వేయడమే?

-ఇదే సరైన అదును…బిజేపితో కలిసి పొత్తు కుదిరెను!

-ఇప్పటికీ జిల్లాల్లో టిడిపికి బలమైన నేతలున్నారు?

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలు ఎంత కలిసొచ్చినట్లు కనిపించినా కంటి మీద కునుకులేకుండా పోవడం దురదృష్టకరమే. సరిగ్గా అలాంటి పరిస్ధితే తెలంగాణ ప్రదేశ్‌కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఇంతటి నరకం ఆయన ఎప్పుడూ అనుభవించకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం హాయిగా సాగిన రేవంత్‌ రాజకీయం ఓటుకు నోటుతో తిరగబడిరది. 2014 ఎన్నికల్లో గెలిచిన రేవంత్‌రెడ్డిని, 2018లో ఓడిపోయేదాకా తెచ్చింది. అయినా నిలదొక్కుకున్నారు. కాని ఎప్పుడైతే కాంగ్రెస్‌లో చేరారో అప్పటినుంచి ఆయనకు చికాకు తప్ప ఏమీ మిగలడం లేదు. అందుకే ఆయన ఆ రోజునుంచే తన మనసంతా తెలుగుదేశం వైపే లాగుతున్నట్లుంది. ఎంత ఇష్టంతో కాంగ్రెస్‌లో చేరారో అంత కష్టంగా కాలం గడవడం కూడా ఇబ్బందే..అందుకే ఇక కాంగ్రెస్‌లో వుండడం కన్నా, మళ్లీ తెలుగుదేశంలో చోటు చూసుకోవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అది అమెరికాలో జరిగిన నాటా సభల సమయం కలిసొచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవడానికి ఏదో ఒక బలమైన కారణం కావాలి. అందుకే అమెరికా నుంచి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ అంటే నేనే…నేనంటేనే కాంగ్రెస్‌ అన్నారు. అది పెద్దగా పేలలేదు. మీడియా కూడా దాన్ని పట్టించుకోలేదు. పెద్దగా ప్రచారం చేయలేదు. దాన్ని వార్తగా కూడా ముందు ప్రాధాన్యత నివ్వలేదు. ఆ తర్వాత సీతక్క సీఎం అన్నది చెప్పారు. చెప్పిన సందర్భం ఏదైనా ఆ వ్యాఖ్య కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. అందులోనూ ఆది నుంచి రేవంత్‌రెడ్డి అంటే అడుగడుగునా వ్యతిరేకిస్తున్న భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విషయంపై స్పందించారు. ముప్పై, నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కే సేవ చేసిన వాళ్లుఎంతో మంది వున్నారు. అంటూ ఇతర నాయకుల పేర్లు చెప్పి, రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిరచారు. అయినా అది కూడా పెద్దగా పేలలేదు. దాంతో ఉచిత విద్యుత్‌ మీద రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇది జరగాలని ముందే రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఒక్కొక్కటిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆఖరున తెలంగాణలో రైతులకు ఎకరాకు గంట చొప్పున, మూడు ఎకరాలకు మూడు గంటల కరంటు సరిపోతుందన్న మాటలు దుమారం రేపాయి. ఏది ఏమైనా ఎంత సమర్ధించుకున్నా చెప్పిన సందర్భం గురించి ఇప్పుడు ఎంత వివరించినా అందులో నిగూడార్ధం మాత్రం అదే..అన్నది తెలంగాణ సమాజం గుర్తించింది. కాంగ్రెస్‌ పార్టీకూడా తల పట్టుకున్నది. ఇదే అదునుగా అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. పొరపాటును కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచుతారన్నది ప్రజల్లోకి చర్చకు తెరతీశారు. 

అయితే రేవంత్‌రెడ్డి కోరుకున్నది కూడా ఇదే..జరుగుతున్నది కూడా అదే కావడంతో ఆయన సక్సెస్‌ అయ్యారనే చెప్పుకోవాలి. 

నిజానికి కాంగ్రెస్‌ ఎంత పుంజుకున్నా, ఒక వేళ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించినా కాని రేవంత్‌ ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోయే అవకాశం వుంది. ఆ ప్రమాదాన్ని ముందే రేవంత్‌ రెడ్డి గమనించారు. అందుకే ఇప్పుడే అస్త్ర సన్యాసం చేస్తే కాంగ్రెస్‌ పార్టీ కకావికలమైపోతుంది. పైగా కాంగ్రెస్‌ పార్టీ నడిచేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందిస్తున్నది కూడా రేవంత్‌కు చెందని వర్గమే అన్నది అందరికీ తెలిసిందే. ఇంత చేసి, పార్టీకి ఎంత బలం తెచ్చినా, ఉపు తెప్పించినా ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న వచ్చే సరికి రేవంత్‌రెడ్డి అన్నది ఎక్కడా వినిపించడం లేదు. ఒప్పుకునే సీనియర్లు లేదు. పైగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక కూడా రేవంత్‌కు సుతారం ఇష్టం లేదు. పొంగులేటి వచ్చిన తర్వాత ఆయన కన్నా బలమైన నేత మరొకరు లేరన్నంత ప్రచారం బలంగా సాగుతోంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిన మరునాడే వైఎస్‌. షర్మిల కాంగ్రెస్‌లోకి రాక..అన్న దానిపై చర్చ మొదలైంది. నిజానికి ఆమె వైఎస్‌ఆర్టీ పార్టీ రిజిస్టర్‌ చేసుకున్నారు. సొంతంగానే పార్టీని నడుపుతున్నారు. అయినా ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకం కావడం లేదు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ముందు కాంగ్రెస్‌లోకి పంపి, ఆ తర్వాత షర్మిలను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 

షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడం రేవంత్‌రెడ్డికి ఆది నుంచి సుతారం ఇష్టం లేదు.

ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకురావడం అసలే ఇష్టంలేదు. అయినా ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా పొంగులేటి లేదు లేదనుకుంటూనే, కాదు..కాదనుకుంటూనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తున్నారు. తాజా రాజకీయాలు వివరిస్తున్నారు. ఆయన సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ను బతికించడం కన్నా , సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి జీవం పోయడం తన రాజకీయ జీవితానికి ఉపయోగమని భావించినట్లున్నారు. అందుకే చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వడాన్ని ఆనాడు జగన్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. పైకి ఆర్టికల్‌ 3 ప్రచారం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే, మరో వైపు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడు. తీరా తెలంగాణ ప్రకటన జరిగే సమయంలో సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించాడు. అందుకు షర్మిల కూడాపూర్తిగా సహకరించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమె కూడా పాల్గొన్నది. తెలంగాణలో జగన్‌కు ఆనాడు బలంగా మద్దతు పలికిన కొండా సురేఖలాంటివారిని కూడా జగన్‌ మోసం చేశాడన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా దివంగత వైఎస్‌. బతికున్నంత కాలం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తే. తెలంగాణ ఇస్తే ఆంధ్రా ప్రజలు వీసా తీసుకొని వెళ్లాలా? అంటూ అసంబద్ద ప్రకటనలు చేశాడు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతీశాడు. అలాంటి రాజశేఖరెడ్డి బిడ్డనంటూ, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల రావడాన్ని ఏ తెలంగాణ వ్యక్తి జీర్ణించుకోలేని విషయం. అదే స్పందన రేవంత్‌రెడ్డి కూడా వ్యక్తంచేశాడు. అయినా ఆమెను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకే రేవంత్‌ ఇక తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం ముఖ్యమన్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన షర్మిలనే తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు , తెలంగాణ కోసం ఉత్తరం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాజకీయం చేయడం అవసరమని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు.తెలంగాణ లో తెలంగాణ నాయకులే నాయకత్వం వహించే అవకాశం వుంది. తెలంగాణలో ఇంకా తెలుగుదేశం బలంగానే వుందన్న భావన వ్యక్తమౌతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు, పూర్వ రంగారెడ్డి జిల్లాలో కూడా తెలుగుదేశం బలంగానే వుంది. ఖమ్మం, నిజామాబాద్‌లలో కూడా తెలుగుదేశం నాయకులున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు సాధించినా మేలే..అన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే ఆయన స్వయం నిర్ణయాలకు తావుంటుంది. చంద్రబాబు సహాకారం కూడా పూర్తిగా వుంటుంది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులే కాదు, ఇప్పుడు రేవంత్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన నాయకులు కూడా ఆయనతోపాటు బైటకు వచ్చే అవకాశం వుంది. దాంతో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారు సైతం ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌ పుట్టి మునగడం ఖాయం…తెలుగుదేశం మళ్లీ చిగురించడం రేవంత్‌కు అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *