వినూత్న ఆలోచన ….భద్రత కు ముద్ర

వేములవాడ రూరల్ నేటి దాత్రి

ప్రెండ్లి పోలీస్ కి అసలైన అర్థం చెపుతున్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ పోలీసులు ప్రజా చైతన్యనికి మీ కోసం అనే కార్యక్రమంతో ప్రజల ముంగటనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో రూరల్ పోలీస్ శాఖ వారు వినూత్న ప్రయోగం చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో సరైన ముద్ర వేసుకొని ముందుకు సాగుతున్న పోలీస్ శాఖ గ్రామీణ ప్రాంతలో ప్రజలకు క్షేత్ర స్థాయి లో పలు అంశాల పై అవగాహన కల్పించే ప్రయతనం చేస్తున్నారు ఈ సందర్భంగా రూరల్ సిఐ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలుకు రోడ్డు భద్రత సిసి కెమెరా డయల్ 100 షి టిమ్స్ మొదలగు అంశాల పైన ప్రజలకి అవగాహన కల్పించారు అలాగే యూవత ఎవరుకుడా చేడు వ్యాసనాలకి అలవాట్లు పడ కూడదని డ్రగ్స్ గంజాయి లాంటి చెడు అలవాట్లు కు దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చారు ఒక వేళ ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి కోసం జిల్లా పోలీసు శాఖ ఆపరేషన్ విముక్తి పేరిట డి -ఆడిక్షన్ సెంటర్లు ను ఏర్పాటు చేసింది అని చెప్పారు అలాగే గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు చూడాలని సూచించారు మండపాల వద్ద డిజే లు పెట్టి ఇతరుల కి ఇబ్బందికరంగా చేయరాదు అని తేల్చి చెప్పారు అనంతరం గ్రామ సర్పంచ్ సోయినేని కరుణాకర్ రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గోసుకుల రవి సిఐ కరుణాకర్ ఎస్ఐ మారుతి లను శాలువల తో సన్మానించినారు ఇట్టి కార్యక్రమంలో యూవకులు మహిళ సంఘాలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!