సిపిఎం, సిపిఐ నాయకుల పిలుపు
విద్యుత్ పోరాట అమరవీరులకు ఘన నివాళులు
నర్సంపేట,నేటిధాత్రి :
ఆనాడు హైదరాబాదులోని బషీర్ బాగ్ వద్ద విద్యుత్తు కోసం పోరాటంలో పాల్గొని అమరులైన అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి పిలుపునిచ్చారు. హైదరాబాదు బషీర్ బాగ్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఐ,సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంజాల రమేష్, కొరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు తలొగ్గి 2000 సంత్సరంలో చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలపై విద్యుత్ బరాలు మోపాడని ఈ బారాలకు వ్యతిరేకంగా సిపిఐ,సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీల అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగిందన్నారు.ఈ నేపథ్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జర్పించిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు అర్పించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ప్రజలపై దొంగచాటుగా కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతున్నదని, మరొక వైపు కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రైతాంగం వాడుకునే వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టుటకు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతరేక విధానాల పై విద్యుత్ పోరాట అమరుల త్యాగం స్ఫూర్తిగా ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, సీపీఐ నాయకులు అక్కపెల్లి రమేష్, చెన్నకేశవులు, పార్థసారథి,ఎస్ఎఫ్ఐ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.