చేర్యాల నేటిధాత్రి..
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించాలని సిపిఐ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని ఇకనుంచి అయినా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరారు. గంటసేపు గ్రామపంచాయతీ ముందు ధర్నా నిర్వహించి అనంతరం వాటర్ క్యాన్ తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జినుకల హరికృష్ణ. పెంబర్ల రాజు, గర్రెపల్లి రాజు, గర్నపల్లి బాలమల్లు, ఎల్లవ్వ, మల్లవ్వ, పోచమ్మ, షారుక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.