`సీనియర్లందరినీ సాగనంపుడే!
`ఒక్కొక్కరినీ వరుస పెట్టి తరుముడే?
`ఎన్నికల నాటికి పాత వాసన లేకుండా చేసుడే!
`రేవంత్ మొదటి నుంచి అమలు చేస్తున్నదే
`ఏదో ఒక సాకు చూపి చిచ్చు పెట్టుడే!
`ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టుడే?
`పొమ్మని పొగపెట్టుడే!
`పోకపోతే రాళ్లేసుడే…
https://netidhatri.com/వరాల-తెలంగాణ/
`నిద్రలేకుండా చేసుడే?
`నేనంటే నేనే అని పించుకునుడే!
`రేవంత్ కు ఎదురులేకుండా చేసుకునుడే!
`పారిపోయేదాకా సోషల్ మీడియాను ఉసిగొల్పుడే!
`హస్తంలో సీనియర్లు వెళ్లేదాకా అలజడే!
`రేవంత్ పెడుతున్న కిరికిరే!
`సీనియర్లను అదును చూసి తరిమేయడమే
`తనకు అడ్డు లేకుండా చేసుకునుడే.
`పాపం.. సీనియర్ల మనస్తాపం..
`మొన్న జగ్గారెడ్డి.
`నిన్న పొన్నం ప్రభాకర్.
`నేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
`రేపటి లిస్ట్ కూడా రెడీ.
`మొత్తం మీద సీనియర్ల దారి తలోదారి.
`ఇంతకాలం వాళ్లదే హవా…
`ఇప్పుడు వాళ్లే కోన్ కిస్కా?
హైదరబాద్,నేటిధాత్రి:
ఏకౌతాడని తెచ్చిపెట్టుకుంటే రేవంత్ మేకయ్యాడని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. తమ భవిష్యత్తు ఏమిటో? అర్ధం కాక ఆగమాగమౌతున్నారు. ఇప్పటికీ మేమే సుప్రిం అని చెప్పుకునేంత స్దాయి వున్న నేతలు కూడా చాలా సైలెంటు అవుతున్నారు. తమ దారి తాము చూసుకోవాలా? లేక రేవంత్ ముందు మౌనం వహించాలా? ఆయన కోసం పడిగాపులు కాయాలా? పరువు పోకుండా వుండేందుకు అంటీ ముట్టనట్టు వుండాలా? అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఎవరికీ చెప్పడు. ఎవరినీ సంప్రదించడు. గత కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను ఎక్కడా పాటించడు. అంతా వన్‌మ్యాన్ షో..చేస్తుంటాడు. అక్కడ ఎవరు వున్నా…తను మాత్రమే గుర్తించేలా చేసుకుంటాడు. ఇది ఆది నుంచి సీనియర్లకు కంటగింపుగానే మారింది. ఆ సమయంలో జగ్గారెడ్డి లాంటివారు కొంత మంది అప్పటికప్పుడు ఫైర్ అయినా, తర్వాత వాళ్లు కూడా సైలెంటు అయ్యారు. ఆ మధ్య రేవంత్ మీద పెద్దఎత్తును యుద్దం ప్రకటించినంత పనిచేశారు. అయినా వారి మాటలు అధిష్టానం వినిపించుకోలేదు. సీనియర్లను పట్టించుకోలేదు. దాంతో రేవంత్‌కు మరింత బలం పెరిగినట్లైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు వున్నది ఒకటే ఆప్షన్. తెలంగాణలో అధికారంలోకి రావడం? కాని రేవంత్ నాయకత్వం మూలంగా మెదటికే మోసం వచ్చేలా వుందన్న సంగతి మాత్రం పార్టీ అధిష్టానం నమ్మడం లేవు. సీనియర్ల మాటలు అసలే పట్టించుకోవడం లేదు. ఓ వైపు రేవంత్ తన రాజకీయం ఆడుతూనే, మరో వైపు పార్టీలో తాను ఒక కార్యకర్తను మాత్రమే అన్నట్లు వ్యవహరించడాన్ని సీరియర్లు జీర్ణించుకోలేకోకపోతున్నారు. గతంలో ఎంతోమంది నాయకులు కాంగ్రెస్‌లో అధిపత్యం కోసం ఆరాటపడినప్పుడుగాని, పదవుల్లో వున్నప్పుడుగాని రేవంత్‌రెడ్డిలా వారు వ్యవహరించలేదు. వారు చెప్పాల్సినదానిని ముక్కుసూటిగా చెప్పేవారు. కాని రేవంత్ చెప్పే మాటలకు చేసే చేతలుకు అసలే పోలిక వుండడం లేదు. అదే సీనియర్లకు అంతు చెక్కడం లేదు. తాజాగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అన్న ప్రకటన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన చేయించి మరో సారి తనదే పై చేయి అన్నది రేవంత్ నిరూపించుకున్నాడు. ఓ వైపు టిపిసిసిలో అసంతృప్తి వ్యక్తమౌతున్న తరుణంలో ఇలాంటి ప్రకటన కేంద్ర పార్టీ ప్రకటించడం విచిత్రంగా వుంది.
సీనియర్లను సాగనంపే ప్రయత్నంలోనే రేవంత్‌రెడ్డి తలమునకలై వున్నాడన్నది సీనియర్ల ఆందోళన.
అనుకుంటున్నట్లుగానే తాజాగా పిసిసి. మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా తనకు పార్టీలో పొగబెడుతున్నారన్నదాకా వచ్చాడంటే ఇక మిగతా సీనియర్ల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. తాజా మాజీ అధ్యక్షుడే రేవంత్ రాజకీయాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పినట్లే అయ్యింది. రేవంత్ రాజకీయం ముందు తాము దిగదుడుపే అన్నట్లు ఒప్పుకున్నట్లైంది. రేవంత్ రాజకీయం సరే…పార్టీని మింగేసే పరిస్థితి వస్తుందన్న ఆలోచన ఎవరూ చేయడం లేదు. ఆ దిశగా ప్రశ్నించే స్ధితిలో లేరు. అధిష్టానం ఇప్పుడు ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్దితి లేదు. అందుకే మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పిందే నడుస్తోందన్నది. పార్టీ మాత్రం అవగమౌతోంది. రేవంత్‌రెడ్డి పార్టీని నిలబెడుతున్నాడని అనుకోవాలో? లేక అవసరాన్ని బట్టి రాజకీయం చేయడం కోసం తన వర్గాన్ని నింపుకుంటున్నాడో స్పష్టంగా కనిపిస్తూనే వుంది. అయినా అధిష్టానం గుర్తించడం లేదు. ఎక్కడైతే సీనయర్ల హవా కొనసాగుతోందో? అక్కడ కొత్తవారిని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలున్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతల స్ధానాల్లోనే కొత్తవారిని తెచ్చివారి నెత్తిన కుంపటిపెడుతున్నాడు. ఇది పార్టీకి తీరని నష్టం చేకూర్చే పనే అయినా, వ్యక్తిగతంగా తన రాజకీయానికి ఈ రోజు కాకపోయినా, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అదే రేవంత్ ఎత్తుగడ. ఇది సీనియర్లకు అర్ధమైంది. కాని వాళ్లు చేష్టలుడిగి చూడాల్సివస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి లాంటివారు కూడా మీడియా ముందు తన అసహనాన్ని, అశక్తతను వ్యక్తం చేశాడే గాని, డిల్లీలో తేల్చుకుంటా?
అని హెచ్చరించలేకపోతున్నాడు. అంటే డిల్లీలో తమకు గౌరవం లేదని పరోక్షంగా ఒప్పుకున్నట్లే. అందుకే ఆయన కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాడు. ఎవరోఅన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేనంద దీనస్ధితిలోకి వెళ్లిపోయాడు. నిన్నటిదాకా పిపిసి. అధ్యక్షుడుగా వున్న నాయకుడే పార్టీలో జరుగుతున్న వాటిని ప్రశ్నించలేకపోతే, ఆయనను నమ్ముకున్నవారికి ఏం సాయం చేయగలడు? ఆయన వర్గానికి ఏం సీట్లు ఇప్పించుకోగలడు. అంతదాకా ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డే పార్టీని వీడితున్నట్లు విసృత ప్రచారం జరుగుతుంటే, ఆయన సీటుకు కూడా భవిష్యత్తులో గ్యారెంటీ లేకపోవచ్చనేదే నిజం కావొచ్చు. సిట్టింగులందికీ టిక్కెట్లు అన్నది కాంగ్రెస్‌లో ఏనాడు అనుసరిచింది లేదు. గతంలో ఆయన పిసిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. అంతే కాదు గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అత్యంత సమీప బంధువైన పాడి కౌషిక్‌రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పుడు ఆయన బిఆర్ఎస్లో వున్నాడు. ఎమ్మెల్సీ అయ్యాడు. దాంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు కూడా ఎన్నికల ముందు బిఆర్ఎస్లో చేరుతున్నాడంటూ రేవంత్ రెడ్డే ప్రచారం చేస్తున్నాడన్నది ఆయన ప్రధాన వాదన. కాకపోతే పేరు మాత్రం చెప్పడంలేదు. పైగా నేను మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే వున్నాడు. ఆరు సార్లు ఎమ్మెల్యేలను అయ్యాను. ఇవన్నీ వివరణ ఇచ్చుకునేదాకా రేవంత్ తెచ్చాడంటేనే ఉత్తమ్‌కు కాంగ్రెస్‌లో చోటు లేకుండా చేస్తున్నాడనే సంకేతాలు పంపినట్లే లెక్క.
ఇక మరికొందరు సీనియర్లు అలకపాన్పు ఎక్కినా ఎవరూ పట్టించుకోవడంలేదు.
అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడుగా పార్టీ అధికారంలో లేని సమయంలో కాంగ్రెస్ కోసం ఎంతో చేసిన పొన్నం ప్రభాకర్ లాంటి వారికి కూడా పార్టీలో తీరని అవమానం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడ తన స్వరాన్ని ఎందుకు పెంచడం లేదో అర్ధం కావడం లేదు.. కాంగ్రెస్ పార్టీ ఎంపిగా వుండి కూడా తెలంగాణ ఉద్యమం చేసిన వారిలో పొన్నం ఒకరు. అంతే కాదు తెలంగాణ బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే మూలంగా సృహ కోల్పోయిన నాయకుడు. అలాంటి నాయకుడికి కూడా పార్టీలో విలువ లేకపోవడం అన్నది ఒకింత చింతించాల్సిన అంశమే. గెలుపు గుర్రాల పేరుతో నాయకుల త్యాగాలను పూచిక పుల్లలా తీసేయడం అన్నది ఎవరూ అంగీకరించని అంశం. ఏది ఏమైనా రేవంత్ ఆపరేష్న్ మాత్రం సీనియర్లకు గండాన్నే తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు.