పోలీస్ అధికారులకు ఎన్నికల శిక్షణా కార్యక్రమం.
పలు గ్రామాలలోబందోబస్తు నిర్వహించాలి.
సమస్యలు సృష్టించే వారిపై పూర్తినిగా నిఘ ఏర్పాటు చేయాలి.
పోలీసు అధికారులు వారి పర్సనల్ విషయాలపై ఎలక్షన్ టైం లో ప్రజలపై ఒత్తిడి చేయకూడదు.
అలా చేసిన అధికారిపై కఠిన చర్యలు తప్పవు.
జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ..
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, భద్రత చర్యల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు,చేపట్టవలసిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుదవారం జిల్లా ఎస్పీ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషనర్ అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. జిల్లా లో ఐదు నియోజకవర్గాలైన, మహాబుబ్ నగర్, జడ్చర్ల మరియు దేవరకద్ర, నియోజకవర్గాలకు డిఎస్పీలు ఇన్చార్జిలుగా ఉండి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది.
ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్స్ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని తెలిపారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం బందోబస్తు తయారు చేసుకోవాలని కోరారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డి, సి, ఆర్, బి, డీఎస్ పి,జీవీ రమణా రెడ్డి, సీసీస్ డీఎస్ పి లక్ష్మణ్, ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఎస్, ఐ ఎస్,మరియు ఆర్ ఎస్ ఐ ఎలక్షన్ సెల్ టీమ్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.