రామడుగు, నేటిధాత్రి :
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధినీ, విద్యార్థులు ముందస్తు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. శుక్రవారం నుండి పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థిని విద్యార్థులు రకరకాల పూలను సేకరించి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్ల మోతలతో ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈకార్యక్రమములో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్థులు, విద్యాకమిటి చెర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు.