తూర్పు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం
దాతలు, ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పేదలకు త్వరలో నిత్యావసర సరుకులు
నియోజకవర్గం పేదవారికి ఇబ్బంది రానివ్వను..
సాయి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లను పరిశీలించిన నన్నపునేని
*వరంగల్ సిటి నేటిధాత్రి*
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్యచరణ రూపొందించారు నియోజకవర్గంలోని 25 వేల మంది పేద కుటుంబాలకు త్వరలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయనున్నారు కొందరు దాతల సహాకారంతో ఎమ్మెల్యే నరేందర్ స్వంత ఖర్చులతో ఈ పంపిణీ చేపడుతున్నారు అందుకు సంబందించిన సరుకుల ప్యాకింగ్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య నాయకులతో కలిసి పర్యవేక్షించారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నేపద్యంలో ఏ ఒక్కపేదకుటుంబం ఆకలితో అలమటించద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల స్పూర్తితో నియోజకవర్గంలోని పలువురు దాతలు తన సొంత ఖర్చులతో రెక్కాడితేగాని డొక్కాడని 25 వేల పేదకుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి కార్యచరణ రూపొందించామన్నారు.అందుకు సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.తాను పేదింట పుట్టి ఎన్నో ఇబ్బందులు దాటి వచ్చిన వాడినని ఉపాది లేకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తనకు తెలుసన్నారు.. పేదవారి ఆకలి తీర్చడం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన బాద్యత అని,ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు నా కర్తవ్యం అన్నారు. అందుకే పేదలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం రూపొందించామని,త్వరలో ఈ నిత్యావసర సరుకుల పంపిణీ చేపడతామని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు