దుర్గంధంతో ఇబ్బందులు పడ్తున్న ప్రజలు..
వేములవాడ నేటి దాత్రి
వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి చౌరస్తా వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాక మధ్యలో అగిపోవడంతో అందులోకి మురికినీరు రావడంతో ఆ ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది.దీంతో పట్టణ ప్రజలు,షాప్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.వెంటనే పనులు పూర్తి చేసి చెత్త చెదారాన్ని శుభ్రం చేయలని కోరుతున్నారు.మధ్యలో నిర్మాణ పనులు
ఆగిపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు.