
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
వెంకటాపూర్ నేటిధాత్రి:
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రాజేశ్వరరావుపల్లి సర్పంచ్ వేములపల్లి రమారవీందర్ ములుగు జడ్పి కార్యాలయ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ములుగు జడ్పీ చైర్మన్ మరియు భారాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు ములుగు నియోజకవర్గంలో భారాస జెండా ఎగురాలి, ప్రతిపక్షాల అసత్యపు ప్రచారాలను తిప్పి కొట్టాలి, పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఈ రోజు రైతులు అంతా సంతోషంగా సేద్యం చేసుకున్నారంటే ఆ ఘనత సీఎం కేసీఆర్ దే అని కొనియాడారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ అభివృద్ధి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కెసిఆర్ నేతృత్వంలోనే అమలవుతున్నాయని రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటున్నారంటే సీఎం కేసీఆర్ ముందు చూపు వలనే అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రమా రవీందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలే మా చేరికకు కారణమని, ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి గారి నాయకత్వంలో ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము భారాసలో చేరుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో భారాస పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి విజయం కోసం ఆహార్నిశలు పనిచేస్తామని, అందరం కలిసి నాగజ్యోతిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గౌడ్, జవహర్ నగర్ సర్పంచ్ శనిగరపు రమా రమేష్, సీనియర్ నాయకులు మల్క రమేష్, బూరుగుపేట ఎంపీటీసీ కందరపు మధుకర్, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు కూరెళ్ళ రామాచారి, జాగృతి అధికార ప్రతినిధి అంతటి రాము, మేడారం డైరెక్టర్ తండ రమేష్, రామంజాపూర్ వార్డ్ సభ్యులు అనిల్, రాజేశ్వరరావుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్, లక్ష్మీదేవిపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నరిగ రాజ్ కుమార్, ఉమ్మడి సాంబయ్య పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ ఆశాడపు దేవేందర్, యువజన జిల్లా అధ్యక్షులు కోయిల మహేష్, రాయసాయం శ్రీనివాస్ రెడ్డి, అలిమియా, పాలంపేట మాజీ సర్పంచ్ కారుపోతుల సత్యం, పార్టీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.