ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం.

ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం.

ఆపదలో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సహాయం.

మహబూబ్ నగర్ జిల్లా ;నేటిధాత్రి

ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం.. అందులోనూ టెన్త్‌ ఎప్పటికీ గుర్తుండిపోయే దశ. ఈ దశలో మన జీవితంలోకి వచ్చిన స్నేహితులు మనపై ఎలాంటి ప్రభావం చూపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి మన జీవితాంతం తోడుండే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడా ఇక్కడినుంచే మొదలవుతారు. మనకు అవసరం ఉన్నపుడు.. లేదా మనం ఆపదలో ఉన్నపుడు ఆదుకోవాటానికి కూడా ఈ ఫ్రెండ్షిప్‌ సహాయపడుతూ ఉంటుంది. తాజాగా, ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి టెన్త్‌ ఫ్రెండ్స్‌ అండగా నిలిచారు.

ఈ సంఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గురుకుంట గ్రామానికి చెందిన పి,వెంకటయ్య గత కొన్ని రోజుల క్రిందట ప్రమాదశత్తు చెట్టు పై నుండి జారి కాలు విరిగిపోవడం జరిగింది. వాళ్ల కుటుంబ సభ్యులు కాస్తా ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక, పి,వెంకటయ్య పరిస్థితి అతడి టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ దృష్టికి వెళ్లింది.

1995/1996 మూసాపేట లో వెంకటయ్య టెన్త్‌ పూర్తి చేయగా.. మూసాపేట టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ మొత్తం వాట్సాప్‌ గ్రూపులో ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారు. ఆ వాట్సాప్‌ గ్రూపులోనే వెంకటయ్య కు ఆర్థిక సాయంపై చర్చ జరిగింది. తలా కొంత వేసి తమ మిత్రుడ్ని ఆదుకోవాలని వారు నిర్ణయించారు. వారికి తోచిన విధంగా కొన్ని రూపాయలు పోగేసి వెంకటయ్య కు అందించారు. అది చిన్న మొత్తమే అయినా. ఇబ్బంది పడుతున్న అతడికి టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, కష్టాల్లో ఉన్న మిత్రుడ్ని ఆదుకున్నదుకు ఈ టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1995/1996 బ్యాచ్ కు సంబంధించిన స్నేహితులు ఆపదలో ఉంటే ఎల్లవేళలా మేమున్నామని మనోధైర్యాన్ని పంచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!