భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యార్థి బస్ పాస్ లను,బస్సు ఛార్జీలను తగ్గించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్ డిపో ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల.ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ.జోసఫ్ లు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థి బస్సు చార్జీలను 135 శాతం పెంచడం , 195 రూపాలు బస్ పాస్ ను 450 రూపాయలు చేయడం సిగ్గుచేటని,భూపాలపల్లి నుండి హనుమకొండ వరకు 75 రూపాయలు బస్ ఛార్జి ఇప్పుడు 100 రూపాయలు పెంచడం సరికాదని అన్నారు.వెంటనే బస్సు చార్జీలను తగ్గించి, విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లను మంజూరు చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు చదువు దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం మానుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్,ఎంజాల.రాజేందర్, చందువర్మ,సూరం.రాజు. రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు