నోరెట్లెచ్చే ‘పాపి’ రెడ్డి?

`బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహాం!

`పదవిచ్చిన పార్టీకి ద్రోహమా?

`కులాభిమానం గుర్తొచ్చిందా?

`రెడ్ల రాజకీయం కోసం ఇంత నీచమా?

`గుర్తించి పదవిచ్చినా నీతిబాహ్యమా?

`మళ్ళీ పదవి రాలేదని అక్కసా?

`తెలంగాణ ఉద్యమం చేసింది పదవుల కోసమా?

`ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్‌ లో లేరా?

`వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం?

`మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా?

`తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ దశాబ్ది ఉత్సవాల సమయంలో కాంగ్రెస్‌ సభకు హజరై చేసిన వ్యాఖ్యలపై ఉద్యమ కారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అర్హత లేకున్నా అందలమెక్కిస్తే తన మిడిసిపాటును పాపిరెడ్డి చూపిస్తున్నాడని ఉద్యమ కారులు విమర్శిస్తున్నారు. అందరికంటే ముందు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తగిన గౌరవం తనకు కల్పించాడన్న కృతజ్ఞత లేకుండా మాట్లాడడం విశ్వాస ఘాతకమని అంటున్నారు. 

పరిటాల సుబ్బారావు లాంటి వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో పది శాతం కూడా చేయని పాపి రెడ్డి, పదవీ కాంక్ష కోసం, కులం కోసం కాంగ్రెస్‌ పార్టీ పంచన చేరడం దౌర్భాగ్యం. 

ఉద్యమం ముసుగులో నమ్మక ద్రోహుల కంటే దుర్మార్గుడు పాపిరెడ్డి అని ఉద్యమకారులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఉద్యమ కాలంలోనే అడుగు బైట పెట్టాలంటే తన అవసరాలు ఎవరు తీర్చుతారని చూసిన వ్యక్తి పాపిరెడ్డి. చివరకు వెహికల్‌ లో కూడా పెట్రోల్‌ పోయిస్తే తప్ప కదలని పాపిరెడ్డి నీతులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వున్నాయంటున్నారు. నిజానికి వరంగల్‌ లో ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాలుగా తన భుజస్కందాల మీద మోసిన నాయకుడు పరిటాల సుబ్బారావు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పడరాని పాట్లు పడ్డాడు. ఉద్యోగులను ఉద్యమంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించాడు. రూపాయి, రూపాయి పోగేసి ఉద్యమ కారుల అవసరాలు తీర్చాడు. చివరకు తన జీతం కూడా ఉద్యమానికే ఖర్చ చేసిన చరిత్ర సుబ్బారావుది. అయినా ఆయన ఇప్పటి వరకు తనకు పదవి కావాలని అడగలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నిజానికి సుబ్బారావు లాంటి వారు పదవులకు వన్నె తెస్తారు. పాపిరెడ్డి లాంటి వారు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఉద్యమ సహచరులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆనాడు ఉద్యమానికి ముందుండి నడిచిన వారెవరూ ఇప్పటి వరకు మాకు పదవులు కావాలని కోరలేదు. అదీ ఉద్యమ త్యాగం. 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు రాక ఎదురుచూపుల్లో ఎంతో మంది ఉద్యమకారులున్నారు. 

వాళ్లంతా తెలంగాణ వస్తే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని నిస్వార్థంతో పోరాటాలు చేశారు. అందుకే వాళ్లు ఎక్కడా రాజకీయాలు చేయడం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఎంతో మంది రిటైర్డ్‌ ఉద్యోగులు తమ సేవలు అవసరమనుకుంటే చేయడానికి సిద్దంగా వున్నారు. కానీ తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడిన తొలినాళ్ళలో ఉద్యమం వైపు చూడని మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఉద్యమ నాయకులు తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఓ వైపు అన్ని రంగాలలో అన్ని రాష్ట్రాల కంటే ముందు దూసుకెళ్తుంటే పాపిరెడ్డి పిచ్చి ప్రేలాపణలు చేయడం కాదా? అని ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రస్తానంలో పాపిరెడ్డి పాత్ర ఎంత? రవ్వంత. 

కాకతీయ విశ్వవిద్యాలయం లోని విద్యార్థులు, సిబ్బంది, సకల జనులందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కూడా పాపిరెడ్డి జై తెలంగాణ అన్నది లేదు. ఉద్యాగ సంఘాల నాయకులు ఒత్తిడి చేయడంతో ఉద్యమంలోకి వచ్చినా, కొట్లాటలో ముందున్నట్లు నటించడం తప్ప, ఒంటరిపోరు పాపిరెడ్డి చేసింది లేదు. అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పిలిచి మరీ పాపిరెడ్డికి పెద్ద పీట వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ గా పాపిరెడ్డి పని చేసిన నాడు కాంగ్రెస్‌ పార్టీ అనేక ఆరోపణలు చేసేది. పరీక్షల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా పాపిరెడ్డి నిర్వహించారో అందరకీ తెలుసు. పాపిరెడ్డి మూలంగా ప్రభుత్వం ఎంతో అబాసుపాలైంది. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాపిరెడ్డిని కడుపులోనే పెట్టుకున్నాడు. కానీ పాపిరెడ్డి మాత్రం తన అసలు స్వరూపాన్ని చూపుతున్నాడు. అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించలేదు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో పాపిరెడ్డి ఆడుకున్నాడు. అలాంటి పాపిరెడ్డి ఇప్పుడు తెలంగాణ కలలు నరవేరలేదని మాట్లాడడం విడ్డూరం. విద్యార్థుల జీవితాలను పాపిరెడ్డి చేతిలో పెడితే ఒళ్లు దగ్గర పెట్డుకొని పని చేయకపోగా, మళ్ళీ తన పదవి కొనసాగించలేదని ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడాన్ని ఉద్యమ నాయకులు తప్పు పడుతున్నారు. పదవిచ్చిన పార్టీకి ద్రోహం చేయడం, ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయడం పాపిరెడ్డి ఆత్మ ద్రోహం చేసుకోవడమే అవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అవకాశం కల్పించిన పార్టీకి ద్రోహం చేసి, కులాభిమానం గుర్తొచ్చి కాంగ్రెస్‌ వైపు చూడడం అంటే పచ్చి అవకాశవాదం అంటున్నారు. ఆనాడు గుర్తించి పదవిచ్చినా ఇంత నీతిబాహ్యమా పాపిరెడ్డి అని తిట్టిపోస్తున్నారు. మళ్ళీ పదవి రాలేదని అక్కసు పెట్టుకొని పాపిరెడ్డి చిలకపలుకులు పలకడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది? తెలంగాణ ఉద్యమం చేసింది పదవుల కోసమా? ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్‌ లో లేరా? వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం? మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా? తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా? అని ఉద్యమకారులు పాపిరెడ్డిని తూర్పారపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *