నియోజకవర్గంలో నూతనంగా 7 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు.

నూతన రోడ్లకు సీఎం కేసీఆర్ 50కోట్ల నిధులు మంజూరు.

వరదపై బురద జల్లే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే బుద్ది చెప్తారు.

అకాల వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి
రైతులకు ఎంతో మేలు చేస్తూ ప్రభుత్వ పథకాలని అమలు చేస్తోన్న ప్రభుత్వం.
ఉచితంగా 24గంటల విద్యుత్, రైతు వేదికల నిర్మాణం, ఎరువుల కొరత లేకుండా, సకాలంలో విత్తనాలు అందిచడం, వరి మరియు, మొక్కలు కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
కరోన వలన రాష్ట్ర మరియు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికి ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడ్డాయి.
రాష్ట్రంలో రైతుఋణమాఫీ విడతల వారిగా చేయడం చాలా గొప్ప విశేషం.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ నిర్ణయం వలన జిల్లాలో దాదాపు 60601మంది రైతులకు రూ.360.28కోట్ల లబ్ది చేకూరుతుంది.
పరిస్థితులు మెరుగైన తరుణంలోనే అకాల వర్షాలతో నియోజకవర్గంలో ఎంతో నష్టం వచ్చింది.
అకాల వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, రోడ్లు, విద్యుత్తు మరియు గ్రామాల నష్టాలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందిచి నియోజవర్గంలో మొదటి ప్రధాన్యతగా రోడ్లు మరియు చెరువుల పునరుద్ధరణకు రూ.50 కోట్ల నిధులు మంజూరు.
R&B శాఖ ద్వారా హుజురాబాద్ – భూపాలపల్లి నియోజకవర్గ వర్గాలను అనుసంధానంగా ఉన్న రోడ్డు రెండు దారులు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరగా రూ.14 కోట్లు మంజూరు చేశారు.
రోడ్లు అభివృద్ధి అనంతరం నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట,జడలపేట,జగ్గయ్యపేట ,సుల్తాన్ పూర్ గ్రామాలలో సేడ్ డ్రైన్ ల నిర్మాణం కోసం రూ.2కోట్ల నిధులు మంజూరు.
నియోజకవర్గ పరిధిలోని 4(కనపర్తి, కాశింపల్లి,మెట్ పల్లి, అప్పయ్యపల్లి) నూతన చెక్ డ్యామ్ ల నిర్మాణానికి 20కోట్ల నిధులు మంజూరు.
జిల్లాలో నిర్మాణమవుతున్న మెడికల్ కాలేజ్ కి అదనంగా 110కోట్లతో అదనపు గదులు,ఆశ్రమ భవనాలు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే జిల్లా ప్రభుత్వ దవాఖాన అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలందరూ ప్రభుత్వ దవాఖాన సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
జిల్లా ప్రభుత్వ దవాఖానకు పూర్తి స్థాయి బాధ్యతలతో ఒక సూపరెండెంట్ ని నియమించాలని వైద్య శాఖ మంత్రి కోరడం జరిగింది.
జిల్లా ఇంచార్జి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక చొరవతో గిరిజన గ్రామాల అభివృద్ధికి కి 50కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ విలీనంతో ప్రతి పక్ష పార్టీలకు అయోమయం.
కార్మికుల అభిష్టమేరకే ప్రభుత్వంలో విలీనం. ఆర్టీసీ ఆస్తుల పట్ల దుష్ప్రచారం చేసే పార్టీలకు కార్మికులు బుద్ది చెప్పాలి. బీసీల మైనారిటీ సంక్షేమం కోసం మైనారిటీ రుణాలు పక్రియ.
అడగకుండానే వికలాంగులుగా 4000 పెన్షన్ అందజేత.
ప్రభుత్వం దృష్టిలో మరిన్నీ సంక్షేమ పథకాలు అమలుకు సిద్ధంగా ఉన్నాయి.
ఆర్టీసీ బిల్లు అసెంబ్లీ నుంచే గవర్నర్ వద్ద ఉంది.
కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి భూపాలపల్లి మున్సిపాలిటీకి మరిన్ని నిధులు అందించాలని, ఇప్పటికే కేటాయించిన 30కోట్ల పనులు వేగవంతం అయ్యాయి.
మరో 20కోట్లు నిధులు కేటాయిస్తే ప్రతి వార్డులో అన్ని రకాల అభివృద్ధి 100% జరుగుతుంది.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించాము.
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్.
వ్యవసాయ కరెంట్ లేదు అని పార్లమెంట్ లో ప్రస్తావించిన బండి సంజయ్.
రాష్ట్రంలో ఎక్కడైనా కరెంట్ తిగను పట్టుకో తెలుస్తుంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ గడపగడపకు వెళ్లి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని గతంలో వెళ్లిన మాదిరిగానే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం.
జిల్లాలో నూతనంగా బీసీ మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం.
అకాల వర్షాలతో దెబ్బతిన్న మోరాంచపల్లి మరియు ఇతర గ్రామాలకు ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సగం వెంకట్ రాణి సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు జిల్లా గ్రంధాల చైర్మన్ బుర్ర రమేష్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శోభ ఎంపీపీ లావణ్య స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!