గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి
జిడబ్ల్యూ ఎంసి,నేటిధాత్రి: ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కుడా కార్యాలయంలో అధికారులతొ సమావేశమై ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు భిక్షాటన ను వీడి సమాజంలో గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో వారికి బల్దియా ద్వారా కమ్మునిటీ టాయిలెట్స్, లూ కేఫ్ లు, నర్సరీలు నిర్వహణ బాధ్యతలు అప్పగించమని అన్నారు. విద్యార్హత, వృత్తి నైపుణ్యాలను బట్టి వారికి ప్రత్యామ్నాయంగా మరిన్ని అవకాశాలు,జీవనోపాధి కల్పించాలని అన్నారు.
కొందరు ట్రాన్స్ జెండర్బీలు ఉన్నత విద్యానభ్యసించి ఉన్నారని, ఆర్ ఎం పీ చేసియున్నారని, వారికి జెన్రిక్ ఔషధాల దుకాణం ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాలని అన్నారు. అందుకు గాను త్రినగరిలో జెన్రిక్ ఔషధాల దుకాణం ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజా రెడ్డి ను ఆదేశించారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ద్వారా నగరంలో నిర్వహిస్తున్న
జెన్రిక్ మెడికల్ షాప్ గురించి ఈ వి శ్రీనివాస్ వివరించారు.ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజీ రెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, యూ ఎం సి, పి ఓ వెంకట రమణి, రెడ్ క్రాస్ బాధ్యులు ఈ వి శ్రీనివాస్, అడేపు సూరేష్, ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.