జైపూర్, నేటి ధాత్రి:
త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో చెన్నూర్ ఎమ్మెల్యే గా ప్రజల ఆశీర్వాదం తో మళ్ళీ బాల్క సుమన్ అన్న భారీ మెజారిటీతో గెలవాలని అదే విధంగా కేసీఆర్ గారు సీఎంగా హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటూ ఇందారం లో MPTC-2 అరికె స్వర్ణ సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.ఛత్రపతి శివాజీ గణేష్ మండలి కమిటీ పెద్దలు, మహిళలు ఇందారం ఎంపిటీసి-2 అరికె స్వర్ణసంతోష్ యాదవ్ గారిని శాలువాతో సత్కరించారు,ఈ సందర్భంగా అరికె స్వర్ణసంతోష్ కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు రాజీరు గారు , వొల్లాల వేణుగోపాల్, మేదరి రామన్న,ఇల్లందుల రవీందర్,ఈగ రవన్న,మొండన్న, అశోక్,బల్ల కిష్టయ్య,చేగొండ కొమురయ్య,మీనుగు శంకర్,మహేష్,అల్లాడి శ్రీధర్,రాజు, వెంకటేష్,కొర్వి సాయి,మరియు BRS నాయకులు 13వ వార్డు సభ్యులు అమీరుద్దీన్,బిఆర్ఎస్వీ యూత్ నాయకులు తుంగపిండి శేఖర్, జైపూర్ యూత్ వైస్ ప్రెసిడెంట్ వొల్లాల భాను,బిఆర్ఎస్ నాయకులు చిప్పకుర్తి సురేష్, చిప్పకుర్తి శేఖర్,ఎల్కటూరి శివ, కొర్వి రాజన్న యాదవ్ గారు మరియు మహిళా భక్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది…