గ్రూప్ 2 పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని ధర్నా: బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్

సిద్దిపేట నేటిధాత్రి…

బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. నిన్న రాత్రి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ గ్రూప్-2 పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని శాంతియుతంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర సత్యాగ్రహం చేస్తా అనగానే గృహనిర్బంధం చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా ఈరోజు సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఆరు లక్షల మంది ఉన్నటువంటి గ్రూప్ 2 పరీక్ష పోస్ట్ పోన్ చేస్తే మీ తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేది ఏముంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, సిద్దిపేట జిల్లా కోశాధికారి రోమాల బాబు, సిద్దిపేట అసెంబ్లీ ఇన్చార్జి బాకురి అశోక్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు పంగబాబు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఈర్ల మల్లేశం ముదిరాజ్, అసెంబ్లీ ఆర్గనైజేషన్ సెక్రటరీ రంగదాం భాను, అసెంబ్లీ మండల అధ్యక్షుడు కాతా మహేష్, మండల అధ్యక్షుడు కర్ర హరికిరణ్, నారాయణరావుపేట మండల అధ్యక్షుడు బండారి శంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!