గ్రూప్ వన్ పరీక్షలు అంటే గోళీల ఆటల ఇప్పటికే రెండు సార్లు రద్దు చేశారు

నిరుద్యోగ జే. ఏ. సి సంఘం నాయకులు రాంటెంకి శ్రీనివాస్

నేటిదాత్రి మంచిర్యాల ప్రతినిధి:

బెల్లంపల్లి: నిరుద్యోగ గర్జన లో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో బెల్లంపల్లి నిరుద్యోగ జేఏసీ నాయకులు రాంటెంకి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ మి బిడ్డలకో న్యాయం మా నిరుద్యోగులకో న్యాయమా కవిత అక్క ఎంపీ గా ఓడి పోతే కొన్ని నెలల్లో ఎం.ఎల్. సి గా నామినేట్ చేశారు మి బిడ్డ లెక్కనే మేము కాదా 6 సంవత్సరాలుగా టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తే మీరిచ్చే పోస్టులు 5000 లా 33జిల్లాలకు పంచితే ఒక్కో జిల్లాకు 4పోస్టులు కొన్ని ఎస్. ఏ పోస్టులు అయితే గుండు సున్నా చూపిస్తున్నారు సున్నా ఉన్న చోట మేము ఎలా పరీక్షలు రాసి ఉద్యోగం సాధించాలి, అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన 13500 పోస్ట్ లతో ఇంకా కొన్ని కలిపి 20వెలతో మెగా డీ.ఎస్సీ ప్రకటించాలి, పోస్టులు పెంచ మంటే సిలబస్ పెంచారు, అప్లికేషన్ ఫీజులు రెండింతలు పెంచారు, ఆగ మేఘాల మీద డీ.ఎస్సీ నోటిికేషన్లు ఇస్తున్నారు , మేము ఎలా కన బడుతున్నాం కబడ్దార్ కేసిఆర్ యువకుల పోరాట ఫలితం తోనే తెలంగాణ సాధించు కున్నాం, వారం రోజుల్లో పోస్టులు ప్రకటించాలి , గ్రూపు వన్ పరీక్షలు అంటే ఏమన్నా గోళీల ఆటలు అనుకుంటున్నారా ఇప్పటికీ రెండు సార్లు రాస్తే రెండు సార్లు రద్దు చేశారు మాకు గోర్లు , బర్లు,బార్లు వద్దు మా కొలువులు మాకు కావాలి tspsc రద్దు చేసి UPSC కి అప్పగించాలి లేదంటే మరో ఉద్యమమే రానున్న ఎన్నికల్లో మా నిరుద్యోగులం వార్డ్ మెంబర్,సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి, ఎమ్మెల్యే, ఎంపీ లుగా పోటీ చేసి మిమ్మల్ని ఓడ గొడతం అని మండి పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!