స్వరాష్ట్రంలోనే మౌలిక వసతులు పారిశుధ్యం మెరుగైంది.
రూ.22 లక్షలతో నిర్మించిన రాజాపూర్ గ్రామపంచాయతీ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ వచ్చాక, గత తొమ్మిది ఏళ్లలో పల్లెలు పట్టణాల్లో మౌలిక వసతులు పెరిగాయని, ప్రజల జీవన ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
రాజాపూర్ మండల కేంద్రంలో రూ.22 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలను పంచాయతీలను పట్టించుకోలేదని, చెత్తాచెదారం పేరుకుపోయి రోగాల బారిన పడేవరని, అంటువ్యాధులు ప్రభలేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం, హరితహారం, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసి పల్లెలకు సీఎం కేసీఆర్ జీవం పోసారని చెప్పారు. ప్రస్తుతం జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
అదేవిధంగా రూ. 2.74 లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. అంతకుముందు గ్రామపంచాయతీ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన మహాత్మ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఆవిష్కరించారు.