వరుస దొంగతనాల పట్ల అప్రమత్తమమైన పోలీసులు
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
వరంగల్ మహానగరంలో జరిగిన వరుస దొంగతనాల పట్ల పోలీసులు ఎక్కడకక్కడ అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ ఆధ్వర్యంలో దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి మండలాల ఎస్ఐలతో కలిసి దుగ్గొండి మండలంలోని గిన్నిబావి ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు.వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేసినట్లు సిఐ కిషన్ తెలిపారు.గ్రేటర్ వరంగల్ జరిగిన వరస దొంగతనాల నేపథ్యంలో దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకుగాను అలాగే ఎన్నికల దృష్యా ,నంబర్ లేని వాహనాలను పట్ల తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో దుగ్గొండి ఎస్సై పరమేష్, నల్లబెల్లి ఎస్ఐ నగేష్,ఖానాపురం ఎస్సై బొంగు మాధవ్ గౌడ్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.