మండలంలో గంజాయి కళకళలాడుతుంది గంజాయి నుండి యువతను కాపాడాలి
సిపిఐ మండల నాయకులు మారేపల్లి క్రాంతి కుమార్
శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లాశాయంపేట మండలం మాందారిపేట గుడిసె వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మద్యం అందుబాటులో ఉండి గ్రామాల్లో వాడవాడకు బెల్ట్ షాపులు అందుబాటులో, 24 గంటలు మద్యం మత్తులో చదువుకోవాల్సిన యువత వారి బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు.
ఈమద్యం దందా ఇంతటితో ఆగకుండా దీనికి తోడు గంజాయి గ్రామాల్లో వాడ వాడకు గుప్పుమంటుంది, దీంతో విద్యార్థులు ఈ గంజాయికి అలవాటు పడి తరచూ ఏదో ఒక గొడవలో ఉంటూ ఆమత్తులో ఎంతటి దారుణానికైనా వెనకాడ బోరని, గంజాయి మత్తులో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనకు కనబడుతూనే ఉంది.కాబట్టి మండలంలోని యువత గంజాయి మత్తుకు అలవాటు పడకుండా, ఆ మత్తు నుండి దూరమయ్యే విధంగా వారి జీవితాన్ని పాడు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. తక్షణమే ఈ గంజాయి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లను, ఈ మండలంలో దానికి సహకరిస్తున్నయువతపై ప్రత్యేక దృష్టి వహించి గంజాయిని అరికట్టి యువతను కాపాడాలని పోలీసులను ప్రత్యేకంగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమేష్, ఇసాక్ అలీ , నసీం, సాంబయ్య, సమ్మయ్య, రాజు అంకుషావలి, తదితరులు పాల్గొన్నారు